E-Paper
Advertisement

గ్లామర్ లుక్‌తో మైమరిపిస్తున్న నిధి ప్రదీప్..లోకేష్ కనగరాజ్ మూవీ అప్‌డేట్ ఇదే!

గ్లామర్ లుక్‌తో మైమరిపిస్తున్న నిధి ప్రదీప్..లోకేష్ కనగరాజ్ మూవీ అప్‌డేట్ ఇదే!
Advertisement

Nidhi Pradeep:నిధి ప్రదీప్..సోషల్ మీడియాలో తనవైన బ్యూటిఫుల్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయ్ మరి. వైట్ స్లీవ్‌లెస్ టాప్, కలర్‌ఫుల్ స్కర్ట్‌లో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా అందరిని తనవైపు తిప్పేసుకుంటుంది నిధి.

ఈ ఫోటోలో నిధి ప్రదీప్ లుక్ చాలా ఫ్రెష్‌గా, స్పెషల్‌గా ఉందనే చెప్పాలి. కలర్‌ఫుల్ డ్రెస్, క్యూట్ కర్లీ హెయిర్, సింపుల్ యాక్సెసరీస్‌తో ఆమె స్టైల్ ఫ్యాన్స్ ఫిదా చేస్తుందనడంలో సందేహం లేదు.ఇక ఈ ఫోటోకు ‘కలర్ మీ ఎక్సైటెడ్ ఫర్ ది ప్రమోషన్స్ ఆఫ్ మిస్టర్ భారత్’ అంటూ ఒక క్యాప్షన్ కూడా యాడ్ చేయడంతో మూవీ లవర్స్ అంతా అటెన్షన్ నిధిపై పెట్టేశారు.. దీంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘మిస్టర్ భారత్’ సినిమా ప్రమోషన్స్ పై నెట్టింట డిబేట్ స్టార్ట్ అయిపొయింది.

Advertisement

మరో వైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో నటీనటులు సోషల్ మీడియాలో సినిమా పావు బజ్ పెంచే పనిలో పడ్డారు.ఆ క్రమంలోనే నిధి కూడా సినిమా పట్ల తన ఎక్సైట్‌మెంట్‌ను ఇలా బయటపెట్టేసింది.

ఇక ‘మిస్టర్ భారత్’ సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ‘జీ స్క్వాడ్’ బ్యానర్‌పై సమర్పిస్తుండటం విశేషం. ఇక నిరంజన్ ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

యూట్యూబ్‌లో బాగా పాపులరైన భరత్ బాలరాజ్ ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం ఇక్కడ మరో విశేషం. ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నిధి ప్రదీప్, బాల సరవణన్, ఆర్. సుందరరాజన్, ఆదిత్య కతిర్, లింగ కీ రోల్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అమాయకమైన మనస్తత్వం ఉన్న ఒక కుర్రాడు, అనుకోకుండా తన అన్నయ్య పెళ్లి విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగే గందరగోళం, దానివల్ల పుట్టే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, మనుషుల మధ్య బంధాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాని లోకేష్ కనగరాజ్ ప్రెసెంట్స్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.’ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్.. ఇప్పుడు నిర్మాతగా సరికొత్త కథలని ఆడియన్స్ కి అందించే పనిలో పడ్డారు.ఇక ఈ సినిమాకి ప్రణవ్ మునిరాజ్ మ్యూజిక్ అందిస్తుండగా, ఓం నారాయణ్ కెమెరామెన్‌గా, ధివాకర్ డెన్నిస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఇపుడు ఏ సినిమా హిట్ కావాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కీ రోల్ పోషిస్తున్నాయి.ఇపుడు నిధి ప్రదీప్ కూడా అదే పని చేస్తుందన్న మాట.ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుండటం విశేషం. చూడాలి మరి డిసెంబర్ 11, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో నిధి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో !

ALSO READ :బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర.. ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Tags

Related News

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్..హింట్ ఇచ్చేసిన నటి?

రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!

అల్లు అర్జున్ ఒక్క హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఎంతైనా ఐకాన్ స్టార్ కదా!

తప్పు ఒప్పుకున్న శ్రీలీల.. గ్యాప్ ఇవ్వడంపై క్లారిటీ!

బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర.. ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

అనిరుధ్‌పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకీ వివాదం?

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశంలో ఒక తార.. రన్ టైం లాక్!

Big Stories

Advertisement
×