Allu Arjun Hair Style: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతే తెలిసిందే. పుష్ప సినిమాతో ఈయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన అట్లీ(Atlee) డైరెక్షన్ రాకా సినిమా (Raaka Movie)పనులలో బిజీగా ఉన్నారు. ఇలాంటి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అల్లు అర్జున్ (Allu Arjun)చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన హెయిర్ స్టైల్ ఫాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ పర్సన్ హెయిర్ స్టైలిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అల్లు అర్జున్ కు అలీమ్ హకీమ్(Alim Hakim) హెయిర్ స్టైలిస్ట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని సౌత్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్స్ కు కూడా అలీమ్ హకీమ్ హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. అయితే ఈయన ఒక హెయిర్ స్టైల్ చేయడం కోసం భారీగా చార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈయన వద్ద ఏదైనా ఒక హెయిర్ స్టైల్ చేయించుకుంటే ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. ఇలా లక్ష రూపాయలు కాకుండా అదనంగా 18 % జీఎస్టి తో కలిపి రూ.1, 18,000 తీసుకుంటున్నట్టు సమాచారం. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు విరాట్ కోహ్లీ సైతం ఈయన వద్ద హెయిర్ స్టైలిస్ట్ చేయించుకుంటారని తెలుస్తోంది.
ఇలా ఒక హెయిర్ స్టైల్ కోసం లక్ష 18 వేల రూపాయలు చెల్లించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ విధంగా అలీం హకీమ్ హెయిర్ స్టైల్ కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిసి ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ లెక్కలను మార్చిన అల్లు అర్జున్ త్వరలోనే రాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల కాలంలో ఎలాంటి అప్డేట్ రాలేదని చెప్పాలి.
ఇలా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం సినిమా విడుదల తేదీ గురించి కూడా క్లారిటీ లేకపోవడంతో బన్నీ ఫాన్స్ కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతోంది. ప్రస్తుతం లోకేష్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?