E-Paper
Advertisement

రూ.25 కోట్ల టార్గెట్.. నితిన్‌కు అంత సీన్ ఉందా?

రూ.25 కోట్ల టార్గెట్.. నితిన్‌కు అంత సీన్ ఉందా?
Advertisement

Alias Rukmini:‘అలియాస్ రుక్మిణి’..నాని నిర్మాతగా నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇపుడు రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.అవును ..ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.25 కోట్ల వరకు జరుగుతుందని ఇన్ సైడ్ టాక్ .నిజానికి ఈ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ టార్గెట్ రీచ్ అవుతుందా అన్న అనుమానాలు రైజ్ అవుతున్నాయి.

ముఖ్యంగా నైజాం హక్కులను ప్రముఖ సంస్థ ఎస్వీసీ రూ.10 కోట్ల రికవరబుల్ అడ్వాన్స్‌కు తీసుకుందని, ఆంధ్రా రైట్స్ రూ.10 కోట్లు, ఒక్క ఉత్తరాంధ్ర హక్కులకే రూ.2.5 కోట్లు అడుగుతున్నారన్న టాక్ రావడంతో అసలు నితిన్ మార్కెట్‌కు ఈ రేంజ్ బిజినెస్ కరెక్టేనా అన్న డిబేట్ ఇపుడు నెట్టింట జోరుగా సాగుతుంది.ఒకప్పుడు వరుస హిట్లతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నితిన్‌కు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయి మార్కెట్ లేదన్నది వాస్తవం.

Advertisement

గతంలో వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్‌హుడ్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా బోల్తా కొట్టాయో చెప్పక్కర్లేదు.ఇక తమ్ముడు,చెక్ వంటి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అలాంటి ఈ టైమ్‌లో ‘అలియాస్ రుక్మిణి’కి రూ.25 కోట్ల బిజినెస్ జరుగుతున్నప్పటికీ ఆ మొత్తాన్ని వెనక్కి రాబట్టడం అంత ఈజీ కాదన్నది వాస్తవం. సినిమా ఆ స్థాయి వసూల్లని కొల్లగొట్టాలంటే మాత్రం ఫస్ట్ డే నుంచే టాక్ సూపర్ హిట్ రావాలి.ఇక నైజాం లో రూ.10 కోట్లు రికవరీ కావాలంటే మాత్రం పెద్ద మ్యాజిక్కే జరగాలి.

Advertisement

ఈ మూవీని మురళీ కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేస్తుండగా, ఇదొక ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అప్ డేట్స్ చూస్తేనే అర్థం అవుతుంది.
అయితే కేవలం లవ్ స్టోరీ తో పాటు బలమైన ఎమోషన్, కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. లేదంటే ఎంత బిజినెస్ జరిగినా కలెక్షన్లు స్థిరంగా ఉంటాయని చెప్పలేం.అయితే సినిమాకి నాని ప్రొడ్యూసర్ గా ఉండటం కాస్త కలిసొచ్చే అంశమే.

అయితే ఇదే డిసెంబర్ 4న నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ‘అలియాస్ రుక్మిణి’కి గట్టి పోటీ ఉండటం పక్కా.పైగా థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరక్కపోవచ్చు కూడా.పైగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఈ పోటీ మరో పెద్ద చాలెంజ్ అని చెప్పక తప్పదు.

మొత్తానికి నితిన్ కెరీర్‌కు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. మరి రూ.25 కోట్ల బిజినెస్ టార్గెట్‌ను రీచ్ అయ్యి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేక అబ్బే నా వల్ల కాదంటూ మధ్యలోనే చతికిల పడతాడా అన్నది డిసెంబర్ 4న తేలిపోనుంది !

ALSO READ :బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

Tags

Related News

రౌడీ హీరోతో ఎనిమిదేళ్ల అనుబంధం..ఆ రోజులను తలుచుకుని ఎమోషనల్ అయిన రాహుల్!

సూర్య విలన్ గా టాలీవుడ్ స్టార్..డైరెక్టర్ వేరే లెవెల్ ప్లానింగ్!

గ్లామర్ లుక్‌తో మైమరిపిస్తున్న నిధి ప్రదీప్..లోకేష్ కనగరాజ్ మూవీ అప్‌డేట్ ఇదే!

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్..హింట్ ఇచ్చేసిన నటి?

రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!

అల్లు అర్జున్ ఒక్క హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఎంతైనా ఐకాన్ స్టార్ కదా!

తప్పు ఒప్పుకున్న శ్రీలీల.. గ్యాప్ ఇవ్వడంపై క్లారిటీ!

Big Stories

Advertisement
×