E-Paper
Advertisement

రౌడీ హీరోతో ఎనిమిదేళ్ల అనుబంధం..ఆ రోజులను తలుచుకుని ఎమోషనల్ అయిన రాహుల్!

రౌడీ హీరోతో ఎనిమిదేళ్ల అనుబంధం..ఆ రోజులను తలుచుకుని ఎమోషనల్ అయిన రాహుల్!
Advertisement

Vijay Deverakonda:విజయ్ దేవరకొండ..రౌడీ హీరో గా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ క్రేజీ హీరో తాజాగా రణబాలి సినిమాతో పలకరించిన సంగతి తెల్సిందే. రణ బాలి సినిమా విషయానికి వస్తే థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.

ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా చూసిన వాళ్లు స్టోరీ అండ్ రెక్టర్ మేకింగ్ స్టైల్‌ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేయడం విశేషం.ముఖ్యంగా సినిమాకి విజయ్ దేవరకొండ యాక్టింగ్‌తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయనే చెప్పాలి.

Advertisement

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, థియేటర్లలో సినిమా మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. పైగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో అన్ని భాషల ఆడియన్స్ సినిమాని ఇబ్బడి ముబ్బడిగా చూసేస్తున్నారు.

ఇక డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండతో మొదటగా ‘టాక్సీవాలా’ అనే సినిమా చేశాడు.సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సాలిడ్ హిట్ అయింది కూడా. ముఖ్యంగా హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్‌లో ఒక మెమరబుల్ మూవీ అని చెప్పాలి. ముఖ్యంగా కారు చుట్టూ తిరిగే కథ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయనడంలో సందేహం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా దర్శకుడిగా రాహుల్ సాంకృత్యాన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా.

Advertisement

ఇక ‘టాక్సీవాలా’ రిలీజై ఎనిమిదేళ్లు కంప్లీట్ అవడంతో రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో తన జర్నీని గుర్తుచేసుకుంటూ, అప్పటి ‘టాక్సీవాలా’ రోజుల నుంచి ఇప్పటి ‘రణబాలి’ వరకు తమ జర్నీని ఫొటోల రూపంలో షేర్ చేసుకున్నారు ఒకప్పుడు చిన్న ప్రయత్నంగా మొదలైన తమ జర్నీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి చేరుకుందని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు రాహుల్.

ఇక ఈ ఫొటోలు చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకే హీరో, ఒకే డైరెక్టర్ కలిసి రెండు పూర్తిగా డిఫరెంట్ సినిమాలతో రావడం చాలా బాగుందని కొందరంటే.మీ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని మరికొంతమంది కోరుకుంటున్నారు.

ALSO READ :బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

మొత్తానికి ‘టాక్సీవాలా’ ఎనిమిదేళ్ల జ్ఞాపకాలు, ‘రణబాలి’ ఓటీటీ రెస్పాన్స్.. ఈ రెండూ ఇప్పుడు విజయ్, రాహుల్ కాంబినేషన్‌ను మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయనే చెప్పాలి .చూడాలి మరి భవిష్యత్తులో వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఉంటుందో లేదో !

Tags

Related News

సూర్య విలన్ గా టాలీవుడ్ స్టార్..డైరెక్టర్ వేరే లెవెల్ ప్లానింగ్!

గ్లామర్ లుక్‌తో మైమరిపిస్తున్న నిధి ప్రదీప్..లోకేష్ కనగరాజ్ మూవీ అప్‌డేట్ ఇదే!

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్..హింట్ ఇచ్చేసిన నటి?

రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!

అల్లు అర్జున్ ఒక్క హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఎంతైనా ఐకాన్ స్టార్ కదా!

తప్పు ఒప్పుకున్న శ్రీలీల.. గ్యాప్ ఇవ్వడంపై క్లారిటీ!

బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర.. ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×