Jr.NTR -Anil Ravipudi: గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్(Dragon) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ అంతా పూర్తి అయిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియజేశారు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమాల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి కానీ ఏ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడలేదు. అయితే ఊహించిన విధంగా ఎన్టీఆర్ లైనప్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi)చేరిపోయారు. టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఎన్టీఆర్(NTR) తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఊహించని విధంగా ఈ కాంబోలో సినిమా రాబోతుందని తెలియజేయడంతో ఫాన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ ఎన్టీఆర్ తెలియచేయడమే కాకుండా నవ్వుల విందు సిద్ధమవుతోందంటూ చెప్పడంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు దానవీరశూర (Dhana Veera Sura) అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా నటించబోతున్న హీరోయిన్ కి సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి నటి భాగ్యశ్రీ (Bhagya Shri)ను సంప్రదించారని ఎన్టీఆర్ తో సినిమా చేయటానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా ఈమె ఇంస్టాగ్రామ్ బయో చూసిన ఫాన్స్ సైతం ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాలో ఈమె ఫిక్స్ అయ్యారని భావిస్తున్నారు. ఈమె ఇంస్టాగ్రామ్ బయోలో టైగర్ కి సంబంధించిన ఎమోజి యాడ్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ని కూడా ఫాలో అవ్వడంతో కచ్చితంగా ఈమె ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి నిజంగానే ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో భాగ్యశ్రీ భాగం కానుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!