E-Paper
Advertisement

సూర్య విలన్ గా టాలీవుడ్ స్టార్..డైరెక్టర్ వేరే లెవెల్ ప్లానింగ్!

సూర్య విలన్ గా టాలీవుడ్ స్టార్..డైరెక్టర్ వేరే లెవెల్ ప్లానింగ్!
Advertisement

Actor Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు సూర్య(Suriya)ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఏడాది సూర్య నటించిన కరుప్పు, విశ్వనాథన్ అండ్ సన్స్, సీన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూర్య తన 49వ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సూర్య తన 47వ సినిమాగా సీన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

కోస్టల్ యాక్షన్ డ్రామాగా

ఇక ఈయన తన 48వ సినిమా జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. సూర్య నటించబోతున్న 49వ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం చేయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇంకా ఈ సినిమా అధికారికంగా ప్రకటించక ముందే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా కోస్టల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో టాలీవుడ్ స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

సూర్యకు పోటీగా గోపీచంద్..

Advertisement

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ గోపీచంద్ (Gopi Chand) ను డైరెక్టర్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గోపీచంద్ అయితే సరిగ్గా సూట్ అవుతారని భావించిన డైరెక్టర్ గోపీచంద్ ను సంప్రదించి కథ వివరించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయాలన్నింటికీ సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ఇలా సూర్య సినిమాలో గోపీచంద్ భాగమవుతున్నారు అది కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలిసిన ఫ్యాన్స్ ఈ సినిమాపై కాస్త ఆతృత కనబరుస్తున్నారు. ఇదే నిజమైతే కనుక వెండితెరపై సూర్య వర్సెస్ గోపీచంద్ అనే విధంగా గట్టి పోటీ ఉండబోతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.

విలన్ గా మెప్పించిన గోపీచంద్..

ఇక గోపీచంద్ హీరోగా ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ ఈయన గతంలో విలన్ పాత్రలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా కనిపించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా చాలా సంవత్సరాలు తర్వాత మరోసారి గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని విషయం తెలిసిన ఫాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. మరి సూర్య గోపీచంద్ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్..హింట్ ఇచ్చేసిన నటి?

Related News

గ్లామర్ లుక్‌తో మైమరిపిస్తున్న నిధి ప్రదీప్..లోకేష్ కనగరాజ్ మూవీ అప్‌డేట్ ఇదే!

ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్..హింట్ ఇచ్చేసిన నటి?

రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!

అల్లు అర్జున్ ఒక్క హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఎంతైనా ఐకాన్ స్టార్ కదా!

తప్పు ఒప్పుకున్న శ్రీలీల.. గ్యాప్ ఇవ్వడంపై క్లారిటీ!

బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర.. ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

అనిరుధ్‌పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకీ వివాదం?

Big Stories

Advertisement
×