Upasana Konidela: ఉపాసన కొణిదెల కామినేని ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న ఉపాసన పెద్ద ఎత్తున హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన (Upasana)ఒక అమ్మాయి తన ప్రెగ్నెన్సీ టైంలో ఎదుర్కొనే ఇబ్బందులు గురించి మాట్లాడారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఒక అమ్మాయి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది ప్రసవాంతరం వచ్చే సమస్యల గురించే ఈ సందర్భంగా మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఉపాసన ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తన రెండవ ప్రెగ్నెన్సీ(Second Pregnancy) అనుభవం తనకు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. అయితే అదే సమయంలో చాలా కష్టంగా కూడా గడిచిందని రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తాను నరకం అనుభవించాను అంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు డెలివరీ అయినప్పటికీ తన చిరునవ్వు వెనుక ఇంకా మానసికంగా, శారీరకంగా కోలుకుంటున్న ఒక తల్లి ఉందని ఉపాసన తెలిపారు. ప్రతి మహిళ గర్భం దాల్చడానికి ముందు చాలా ఆందోళన కలిగి ఉంటుందని ఈమె తెలిపారు.
ప్రెగ్నెన్సీ అంటే కేవలం 9 నెలలు మాత్రమే కాదని, గర్భం దాల్చడానికి ముందు ఉండే ప్రీ ట్రైమిస్టర్ దశలో కూడా చాలా ఆందోళనగా ఉంటుందని తెలిపారు. అందుకే ఇలాంటి కష్టమైన ప్రయాణంలో దంపతులు ఒంటరిగా ఉండిపోకుండా ఇతరుల సహాయం తీసుకోవాలని, తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ఇక తన విషయంలో తనతో పాటు ఉన్న తన డాక్టర్లకు, తన టీం అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా డెలివరీ తర్వాత ప్రతి ఒక్క తల్లి కూడా మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది తనకి కూడా ఎదురైందని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు.
?xtok=MWVseXExY215dnRpaQ%3D%3D
ఇక ఉపాసన ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈమె పెళ్లయిన 10 సంవత్సరాలకు మొదటి సంతానంలో భాగంగా క్లిన్ కారా (Klin Kara)కు జన్మనిచ్చారు. ఈ చిన్నారి పుట్టిన రెండేళ్లకే ఉపాసన మరోసారి గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే .ఈ కవల పిల్లలలో భాగంగా అబ్బాయి, అమ్మాయి జన్మించారు. వీరికి శివ రామ్ కొణిదెల(Siva Ram Konidela ) , అన్వీరా దేవి(Anvira Devi) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారులకు ఉపాసన ఈ ఏడాది జనవరి చివరిన జన్మనిచ్చారు. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగే ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఇబ్బందులు పడ్డానంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
Also Read: అల్లు అర్జున్ ఒక్క హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఎంతైనా ఐకాన్ స్టార్ కదా!