E-Paper
Advertisement

మారనున్న మల్కన్‌గిరి-భద్రాచలం రైల్వే లైన్.. కొత్తగా ఈ రూట్లో వచ్చే చాన్స్?

మారనున్న మల్కన్‌గిరి-భద్రాచలం రైల్వే లైన్.. కొత్తగా ఈ రూట్లో వచ్చే చాన్స్?
Advertisement

Bhadrachalam Railway: ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం జిల్లా మీదుగా తెలంగాణలో భద్రాచలం, పాండురంగాపురం వరకు నిర్మించనున్న కొత్త రైల్వేలైన్‌లో కొంత భాగం పోలవరం జలాశయ ముంపు ప్రాంత పరిధిలో ఉన్నట్లు తేలింది. దీంతో తాజాగా ఎలైన్‌మెంట్‌ మార్చేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. మల్కన్‌గిరి నుంచి భద్రాచలం కొత్త రైల్వే లైన్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ లైన్ వెళ్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని 65 కి.మీ. మార్గంలో అత్యధికం పోలవరం ముంపు ప్రాంతమేనని అధికారులు గుర్తించారు

173.61కి.మీ. కొత్త రైల్వే లైన్‌ కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

మల్కన్‌గిరి నుంచి భద్రాచలం, పాండురంగాపురం(పాల్వంచ రూరల్ మండలం) వరకు సుమారు 173.61 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ను రైల్వే శాఖ ఇటీవల మంజూరు చేసింది. ఇందులో ఒడిశా పరిధిలో మల్కన్‌గిరి, బడలి, పనిమట రాజన్‌గూడ, లచ్చిపేట, కందపల్లి, మోటు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం జిల్లా పరిధిలో కుయుగూరు, సీతారామపురం, భీమవరం, రాజుపేట స్టేషన్లు వస్తాయి. తెలంగాణలో భద్రాచలం, సారపాక స్టేషన్ల మీదుగా బూర్గంపహాడ్ మండలం కృష్ణ సాగర్ గ్రామం గుండా ఈ లైన్ చివరగా పాండురంగాపురం వెళ్తుంది.ఈ స్టేషన్‌ వద్దే ప్రస్తుతమున్న డోర్నకల్‌-భద్రాచలం రోడ్‌-మణుగూరు రైల్వే లైన్‌ కు ఈ కొత్త మార్గం అనుసంధానమై ఉంటుంది.

భూసేకరణ వేళ ముంపు గుర్తింపు

Advertisement

ఈ రైల్వే లైన్‌ ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం జిల్లా పరిధిలో ఉన్న చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో ఏకంగా 65 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ పరిధిలోనే కుయుగూరు, సీతారామపురం, భీమవరం, రాజుపేట స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే భూసేకరణ కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించంగా ఇదంతా పోలవరం ముంపు పరిధిలోకి వస్తుందని గుర్తించారు. దీంతో అత్యధిక భాగం ముంపునకు గురవుతుందని వారు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పోలవరం కలెక్టర్‌తో చర్చలు

రెవెన్యూ అధికారుల సమాచారంతో రైల్వే అధికారులు పోలవరం కలెక్టర్‌తో పలు దఫాలు చర్చలు జరిపారు. ముంపు దృష్ట్యా ఇప్పటికే ప్రతిపాదించిన మార్గంలో లైన్ వేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఎలైన్‌మెంట్‌ను మార్చేలా మళ్లీ క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. పోలవరం ముంపు ఏయే గ్రామాల వరకు ఉందనేది పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ ముంపు ప్రాంతానికి ఎగువన ఎటువైపు నుంచి లైన్‌ వేయొచ్చో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వే తుది దశకు చేరుకుంది. ఆ వివరాలను త్వరలోనే రైల్వే బోర్డుకు పంపనున్నారు.

ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.2,864 కోట్లు వ్యయ అంచనా

Advertisement

ఈ రైల్వే లైన్‌ నిర్మాణానికి అత్యధికంగా అటవీ భూములే అవసరం కానున్నాయి. తొలుత ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.2,864 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల్లో రైల్వే లైన్ ఎలైన్‌మెంట్ మార్పు అనివార్యం కావడంవల్ల ముందుగా అనుకున్న స్టేషన్ల స్థానంలో కొత్తవి నిర్మించాల్సి వస్తుంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల టన్నెల్స్‌ (సొరంగాలు) కూడా నిర్మించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Also Read: గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

Tags

Related News

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ న్యూస్..?

మందు బాబులకు గుండె పగిలే వార్త.. చీప్ లిక్కర్‌తో ఖరీదైన బ్రాండ్లు తయారీ!

ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం

పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్

తెలంగాణ పోలీసులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రమోషన్లు!

ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆవిర్భావ వేడుకల్లో.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు!

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో దారుణం.. దొంగతనం జరిగినా కేసు నమోదు చేయని ఎస్సై!

Big Stories

Advertisement
×