CM Chandrababu: వైసీపీ రోజుకో విషయాన్ని తెరపైకి తెస్తోందా? కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని డిసైడ్ అయ్యిందా? ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్లాన్ చేస్తోందా? ఈ క్రమంలో యూరియా కొరత అంటూ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చిందా? అవుననే అంటున్నారు అధికారులు.
యూరియా కొరత ఏపీని తాకిందా? వైసీపీ ఎందుకు ఆ తరహా ప్రచారంలో నిమగ్నమైంది? రైతుల్లో ఆందోళనకు గురిచేయడమే దీనివెనుక ఉద్దేశమా? ఈ నేపథ్యంలో యూరియా సరఫరా చేసే కేంద్రాల వద్ద రైతులు బారిన తీసిన ఫోటో పెట్టి పెద్ద మేటర్ పెట్టారు మాజీ సీఎం జగన్. ఏపీలో యూరియా కొరత ఉందనేది దాని ఉద్దేశం.
స్వయంగా మాజీ సీఎం ఎక్స్ వేదికగా ఈ తరహా కామెంట్స్ చేయడంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. దీనిపై వివిధ శాఖల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వైసీపీ చేస్తున్నదంటూ ఫేక్ ప్రచారమని తేలిపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటి నుంచి ఫేక్ చేసేప్పుడు జాగ్రత్త జగన్ అంటూ ఎక్స్ వేదికగా టీడీపీ పోస్టు పెట్టింది. ఎరువుల కొరత ఉందని చెబితే తాను అక్కడికి వెళ్తానని, ఒకవేళ నిజంగా యూరియా కొరత ఉంటే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూరియా కొరత లేకున్నా దుష్ప్రచారం చేస్తే వారిని జైలులో వేస్తానని చెప్పకనే చెప్పారు.
ALSO READ: రుషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయాలు.. రాజుగారి మాట, ప్రభుత్వం మాటేంటో?
ఇటీవల కేంద్రం.. ఏపీకి 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయించింది. దీన్ని గంగవరం పోర్టులో దిగుమతి చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 94 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఏపీలో ఇప్పటివరకు యూరియా కోసం రైతులు ఆందోళన చేసింది లేదని అంటున్నారు.
యూరియా నిల్వలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనిపై రైతులలో భయాందోళనలు సృష్టించే లక్ష్యంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ రాజకీయాల బారిన పడవద్దని రైతులను నేరుగా విజ్ఞప్తి చేశారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం. నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో తక్కువగా ఉందని గుర్తించారు. కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలు రైతులుగా నటిస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేందుకు ప్రయత్నం చేసినట్టు తేలింది.
రేపటి నుంచి ఫేక్ చేసేప్పుడు జాగ్రత్త @ysjagan
ఎరువుల కొరత ఉందని చెబితే.. అక్కడికి నేనే వెళ్తా…
ఒకవేళ నిజంగా యూరియా కొరత ఉంటే.. అధికారులపై చర్యలు
యూరియా కొరత లేకున్నా దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం…#PsychoFekuJagan #EndOfYCP #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/Qev32tTmtk— Telugu Desam Party (@JaiTDP) September 3, 2025
.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025