Bigg Boss 9 Promo : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధం అయ్యింది. వాస్తవానికి సెప్టెంబర్ 5వ తేదీ నుంచే ఈ షో ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పుడు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో షో నిర్వహిస్తున్న నిర్వాహకులు సీజన్ పై అంచనాలు పెంచేలా తాజాగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు.
తాజాగా బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కి సంబంధించిన ఒక ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. సర్ప్రైజ్ అప్పుడే రివీల్ చేస్తే ఏముంది.. ఇంకో మూడు రోజులు ఆగండి” అంటూ అంచనాలు పెంచేశారు. నిజానికి ఈ సారి డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ప్రోమో విషయానికి వస్తే.. మ్యాజిక్ స్టిక్ తో హోస్ట్ నాగార్జున కనిపించి.. ఏదో తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లబోతున్నారు అన్నట్టుగా ఆయన బ్యాక్ గ్రౌండ్ సెట్ అప్ ను సెట్ చేశారు. ఇక అంతే కాదు సర్ప్రైజ్ ఇప్పుడే చెప్తే ఎలా మరో మూడో రోజులు అంటూ ప్రోమో ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక బిగ్ బాస్ లవర్స్ అయితే ఆ సర్ప్రైజ్ కోసం ఎంతో ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు.
సామాన్యులకు అగ్నిపరీక్ష..
ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 5 మంది సామాన్యులు అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఏకంగా 20వేలకు పైగా సామాన్యుల నుంచి అప్లికేషన్లు రాగా .. సుమారుగా 45 మందిని ఎంపిక చేశారు. వీరిలో నుండి 5 మందిని ఎంపిక చేయడానికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జియో హాట్ స్టార్ వేదికగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హోస్ట్గా శ్రీముఖి వ్యవహరించగా.. బిందు మాధవి, అభిజిత్, నవదీప్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 13 మందిని ఫైనల్ చేయగా.. వారిలో 5 మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. మొత్తానికైతే చాలా పగడ్బందీగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. మరి ఈసారి ఈ షో ఎలాంటి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
also read: Tollywood Hero: తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. ఆలస్యంగా వెలుగులోకి!