Tollywood Heroin: బయటకు చెప్పుకోలేని వింత జబ్బులతో బాధపడుతున్నప్పటికీ.. ఆ జబ్బు తాలూకు నొప్పిని పంటి కింద అదిమి పెట్టి చిరునవ్వుతో తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఎంతోమంది సెలబ్రిటీలు. ఇకపోతే సమయం సందర్భం వచ్చినప్పుడు తాము అనుభవిస్తున్న ఆ సమస్యల గురించి ప్రస్తావిస్తే మాత్రం.. వారి అభిమానుల ఆవేదన వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు వింత సమస్యలతో బాధపడుతూనే.. సినిమా పట్ల తమకున్న నిబద్ధతను నిరూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒక టాలీవుడ్ బ్యూటీ కూడా ఒక సమస్యతో బాధపడుతోందట. ఈ సమస్యకు పరిష్కారం కోసం వైద్యుల దగ్గరికి వెళ్తే.. వారు ఇచ్చిన వింత సలహా చూసి ఆమె ఆశ్చర్యపోయిందట. అంతేకాదు ఆ పని జరగాలి అంటే అలాంటి వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ ఆమె ప్రశ్నించింది కూడా.. మరి ఆమె ఎవరు? ఆమెకు వచ్చిన ఆ సమస్య ఏంటి? డాక్టర్ ఇచ్చిన ఆ సలహా ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి సోదరి షమితాశెట్టి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. అందం, అభినయంతో, అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. హిందీ, తమిళ్ అంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న షమిత శెట్టి హిందీ బిగ్ బాస్ 3, బిగ్ బాస్ ఓటీటీ 1, అలాగే బిగ్ బాస్ సీజన్ 15లలో కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లతో పాటు మ్యూజిక్ వీడియో ప్రదర్శనలో కూడా సందడి చేస్తున్న షమిత శెట్టికి ఒక అనారోగ్య సమస్య వచ్చిందట. ఈ విషయాలను ఆమె తాజాగా సోనా అలీ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన “ఆల్ అబౌట్ హర్” పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చింది.
also read:స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ..వీడియో వైరల్!
2024లో తనకు ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చిందని, మేలో ఈ సమస్యకు శస్త్ర చికిత్స చేయించుకున్నానని తెలిపిన ఆమె.. ఇదే విషయంపై మాట్లాడుతూ..” ఈ సమస్యకు పరిష్కారం కోసం నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఆ డాక్టర్ మాత్రం నాతో ఒక బిడ్డను కను .అదే ఎండోమెట్రియోసిస్ కి నివారణ అని సలహా ఇచ్చింది. అయితే దీనికి సమాధానంగా.. సరే..నేను బేబీని పుట్టించేందుకు ఆ మనిషిని ఎక్కడినుంచి తెచ్చుకోవాలి? అని సరదాగా అడిగాను అంటూ తెలిపింది. ఇకపోతే నలభై ఏడు సంవత్సరాల షమిత ఇప్పటికీ బ్యాచిలర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
మరి షమిత శెట్టికి వచ్చిన ఈ వ్యాధి విషయానికి వస్తే.. గర్భాశయం లైనింగ్ లాంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరిగే దీర్ఘకాలిక సమస్య. ఇది తీవ్రమైన నొప్పి, స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో సుమారు 40 శాతం మంది మహిళలు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని గురించి చాలామందికి తెలియదు” అంటూ ఆమె హెచ్చరించింది. ఇక ఈ విషయంపై డాక్టర్ నీటా వార్టీ కూడా మాట్లాడుతూ..”ఎండోమెట్రియోసిస్ సమస్య నుండి ఉపశమనం కలగాలి అంటే గర్భం దాల్చడం అనేది సరైన పద్ధతే. నిజానికి గర్భం దాల్చడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి ఆ సమస్యకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
కానీ అదే శాశ్వత పరిష్కారం కాదు. ముఖ్యంగా ఫర్టిలిటీని కూడా ఈ సమస్య ప్రభావితం చేస్తుంది. ఓవరీలపై సిస్ట్ ఏర్పడి అండం నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది” అంటూ ఆమె వివరించింది. ఇక అందుకే శరీరం ఇచ్చే సిగ్నల్స్ ను మహిళలు కచ్చితంగా వినాలని, నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కూడా షమిత సలహా ఇచ్చింది. ఏది ఏమైనా షమిత తనకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.