E-Paper
Advertisement

మిలిటరీ గ్రేడ్ మన్నిక, సూపర్ AI ఫీచర్లు.. తక్కువ ధరలోనే వివో నుంచి నయా 5G స్మార్ట్‌ఫోన్!

మిలిటరీ గ్రేడ్ మన్నిక, సూపర్ AI ఫీచర్లు.. తక్కువ ధరలోనే వివో నుంచి నయా 5G స్మార్ట్‌ఫోన్!
Advertisement

Vivo T5 Lite 5G: బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసే వివో సంస్థ.. భారత్‌లో మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయింది. గతేడాది వచ్చిన ‘T4 లైట్ 5G’కి సక్సెసర్‌గా ‘వివో T5 లైట్ 5G’ మార్కెట్లోకి రాబోతోంది. జులై 16న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్లు మొబైల్ ప్రియుల్లో మంచి అంచనాలను పెంచేస్తున్నాయి. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ కొత్త ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఇందులో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని అందించారు. గత మోడల్‌తో పోలిస్తే.. ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పాలి. అంతేకాదు.. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. దీనివల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది.

Advertisement

Also Read: టెక్నో Camon 50 Ultra 5G ఇండియా లాంచ్ డేట్ ఖరారు.. కలర్స్, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం!

ఈ 5G ఫోన్ పనితీరును మెరుగుపరచడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఫోన్ వెనుక వైపు ఫ్లాట్ డిజైన్‌తో పాటు రెండు కెమెరాల సెటప్ ఉంటుంది. భద్రత కోసం పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, లైట్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Advertisement

ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, స్మూత్ అండ్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే, ఫోన్ కిందపడినా పాడవకుండా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు, దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను కూడా అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత సరికొత్త OriginOS 6 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఇందులో యూజర్ల కోసం ప్రత్యేకంగా AI క్రియేషన్, ఆటోమేటిక్ క్యాప్షన్స్, ఆడియో రికార్డింగ్‌ల కోసం AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, AI డాక్యుమెంట్స్ వంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను జోడించారు. పర్సనల్ డేటా కోసం ప్రైవేట్ స్పేస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Also Read: Instagramలో మన పర్సనల్ ఫొటోలు, వీడియోలను Meta AI వాడకుండా ఎలా ఆపాలంటే?

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×