E-Paper
Advertisement

బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?
Advertisement

Raghav Dating: సినీ ఇండస్ట్రీలో డేట్స్ మారినంత వేగంగా డేటింగ్ భామలు మారిపోతుంటారు,ఇదిక్కడ చాలా కామన్ . నిన్నటి వరకు నువ్వే నా ప్రాణం అన్న హీరోలు తెల్లారితే మరొకరికి ప్రేమికులుగా దర్శనమిస్తుంటారు.ఇక ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైందనే చెప్పాలి.తాజాగా నేనూ ఆబాటలోనే అంటున్నాడు బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, పాపులర్ డాన్సర్ రాఘవ్ జుయాల్.

డెహ్రాడూన్ నుండి వచ్చి డాన్స్ రియాలిటీ షోలతో అదరగొట్టిన రాఘవ్, సిల్వర్ స్కీన్ పై అదే జోష్ చూపిస్తున్న రాఘవ్ పర్సనల్ లైఫ్‌లోనూ అస్సలు తగ్గట్లేదు.విషయంలోకి వెళ్తే టాలీవుడ్ పాపులర్ డిజిటల్ క్రియేటర్, నటి నిహారిక ఎన్ఎమ్ కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాఘవ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలని షేర్ చేసింది . అంతేకాదండోయ్ ఆ ఫోటోలకు లవ్ ఎమోజీతో పాటు ఒక రింగ్ (ఉంగరం) ఎమోజీని కూడా తగిలించింది.

Advertisement

ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా

ఇదిగో ఈ ఎమోజీని పట్టుకునే కొంపదీసి రాఘవ్ కి అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారు నెటిజన్లు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం హిందీలో వస్తున్న ‘భాయ్ తేరా స్టార్ హై’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారని, ఆ సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ రేంజ్ బిల్డప్ ఇచ్చారని కొందరు సర్దిచెప్పుకున్నారు.కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అదేంటో తెలుసా ..ఈ ఉంగరాల చాప్టర్ మర్చిపోకముందే బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్‌తో లవ్ అంటూ గట్టిగా వినిపించడం మొదలైంది.

Advertisement

also read:రాముడి వేషంలోనే సిగరెట్లు.. ఎన్టీఆర్ ముందే అలా.. ఆ తప్పులే కెరీర్‌ను ముంచేశాయా?

ఈమధ్యే రాఘవ్ జుయాల్ ముంబైలోని ఒక లగ్జరీ హోటల్‌లో తన బర్త్ డే పార్టీ ఇస్తే.. బాలీవుడ్ బ్యాచ్ అంతా వచ్చింది . పార్టీ ముగిసిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో అభిమానులు, మీడియా గుంపు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో, షెహనాజ్ గిల్ చేతిని రాఘవ్ ఎంతో కేరింగ్‌గా పట్టుకుని, ఆమెను సురక్షితంగా కారు వరకు తీసుకువెళ్లిన వీడియోలు నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి.నిజానికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే గాసిప్స్ 2023 ఏప్రిల్‌లో విడుదలైన ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ షూటింగ్ రోజుల నుంచే సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సీక్రెట్ పార్టీలు, పండగ సెలబ్రేషన్స్‌ల కలిసి తిరుగుతూనే ఉంది ఈ జంట.

వస్తున్న వార్తలపై ఎప్పుడు నోరు విప్పుతాడో

ఇక ఆ తాజాగా లేటెస్ట్ బర్త్ డే వీడియో చూసిన నెటిజన్లు “బ్రదర్.. నిన్న నిహారికతో లవ్ ఎమోజీలు.. నేడు షెహనాజ్ చేతిలో చేయి..మాములుగా లేదుగా నీ జోరు అంటూ సెటైర్స్ వేస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్.
ఇక రాఘవ్ జుయాల్ సినిమాల విషయానికి వస్తే 2014లో ‘సోనాలీ కేబుల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘ABCD 2’, ‘నవాబ్ జాదే’, ‘స్ట్రీట్ డాన్సర్ 3D’, ‘బహుత్ హువా సమ్మాన్’ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ ‘కిల్’, ‘యుధ్ర’ సినిమాలు చేసిన రాఘవ్ ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.చూడాలి మరి ఈ రెండు భామల ప్రేమాయణం పై వస్తున్న వార్తలపై ఎప్పుడు నోరు విప్పుతాడో.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×