E-Paper
Advertisement

యమహా నుంచి కొత్త టెక్నాలజీ.. E85 ఫ్యూయల్ తో పరుగులు తీసే FZ వచ్చేసింది!

యమహా నుంచి కొత్త టెక్నాలజీ.. E85 ఫ్యూయల్ తో పరుగులు తీసే FZ వచ్చేసింది!
Advertisement

Yamaha Launches FZ Blue Flex Fuel Bike: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి రోజు రోజుకు సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ టెక్నాలజీతో బైక్‌లను తీసుకురాగా, ఇప్పుడు యమహా కూడా ఆ జాబితాలో చేరింది. కంపెనీ కొత్తగా యమహా FZ  బ్లూ ఫ్లెక్స్ బైక్‌ ను రిలీజ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.24 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్ సాధారణ పెట్రోల్ మాత్రమే కాదు, E20 నుంచి E85 వరకు ఉండే ఇథనాల్ మిశ్రమాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు తీస్తుంది.

ఇంజిన్ గురించి..

కొత్త యమహా FZ  బ్లూ ఫ్లెక్స్ బైక్‌ లో 149cc ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. అయితే, ఇథనాల్ మిశ్రమాలపై పనిచేసేలా కొన్ని మార్పులు చేయడంతో పవర్ కాస్త తగ్గింది. ఈ ఇంజిన్ 11.7 హెచ్‌పీ పవర్, 12.8Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ FZతో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ అయినప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు సరిపడే పనితీరును అందిస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, ఇప్పటికే ఉన్న FZ మోడల్‌ను పోలి ఉంటుంది. LED హెడ్‌ లైట్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, సింగిల్ పీస్ సీట్ బైక్‌ కు మంచి లుక్ ను ఇస్తాయి. అలాగే 5 స్పీడ్ గేర్‌ బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, సింగిల్ ఛానల్ ABS  లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

లేటెస్ట్ బైక్ ఓ చిన్న ఛేంజ్ కనిపిస్తుంది. సాధారణ FZలో ఉండే 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ స్థానంలో, ఈ బైక్‌లో 135 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఉంది. బరువు కూడా స్వల్పంగా పెరిగి 139 కిలోలకు చేరుకుంది. ఈ బైక్ ప్రస్తుతం మెటాలిక్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్ తొలి దశలో తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని యమహా బ్లూ స్క్వైర్ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మనున్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు పెరిగిన డిమాండ్

భారత్‌ లో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న నేపథ్యంలో, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో, సుజుకి ఈ విభాగంలో అడుగుపెట్టగా, ఇప్పుడు యమహా కూడా తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను తీసుకొచ్చింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే వాహనం ఒకే ఇంధనంపై ఆధారపడకుండా, ఇథనాల్ కలిగిన ఇంధనాలను ఉపయోగించే అవకాశం ఉండటం.  దీంతో భవిష్యత్తులో ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Read Also: గంటలో ఛార్జింగ్.. 187 కి.మీ రేంజ్.. అదిరిపోయే విడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×