Haranath Biography: సినీ ఇండస్ట్రీ ..ఇక్కడ ఏంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చి అక్కున చేర్చుకుంది, చేర్చుకుంటుంది. ఆ అవకాశాలని అందుకుని అద్భుతంగా ఎదిగిన వారు కొందరైతే చేజేతులా జారవిడుచుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న వారు మరి కొందరు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..సినీ ఇండస్ట్రీలో అందగాడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగిన హరనాథ్.ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలోనే వారికి దీటుగా దూసుకొచ్చిన హరనాథ్ ఆ తర్వాత వ్యసనాల భారిన పడి కెరీర్ ని నాశనం చేసుకున్న తీరు ఎందరిక ఒక పెద్ద గుణపాఠం.
సంపన్న క్షత్రియ కుటుంబంలో పుట్టిన హరనాథ్
హరనాథ్ పుట్టింది 1936 సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో ఒక సంపన్న క్షత్రియ కుటుంబంలో. హరనాథ్ తల్లి దండ్రుల పేర్లు సుభద్రమ్మ,బుద్ధరాజు వరహాలరాజు.ఆయన తండ్రి అయిన వరహాలరాజు కేవలం ధనికుడే కాదందోయ్.గొప్ప రచయిత కూడా.ఇక ‘శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము’ అనే గ్రంథాన్ని రాసింది కూడా ఆయనే . అలాగే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మాయాలోకం’ చిత్రానికి వరహాలరాజు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేయడం విశేషం.అలా తండ్రి వరహాలరాజు ప్రభావం పడటంతో చిన్ననాటి నుండే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడు హరనాథ్.
చెన్నైలో స్కూలింగ్ , కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఏ డిగ్రీ పూర్తి చేసిన హరనాథ్ అప్పట్లోనే అందరిలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవాడు. ధనిక కుటుంబం నుండి రావడంతో ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన వస్తువులు వాడుతూ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేసేవాడు హరనాథ్.అలా ఒక గ్యాంగ్‌ను మెయింటైన్ చేస్తూ, ఇతర గ్యాంగులతో గొడవలకు దిగుతూ ‘కాలేజీ రౌడీ’గా పేరు తెచ్చుకున్నాడు కూడా. అయితే ఇంత చేసినప్పటికీ నాటకాలు వేయడం మాత్రం ఆపలేదు హరనాథ్.పైగా‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ వంటి ఎన్నో నాటకాల్లో నటించి మంచి గిఫ్ట్స్ గెలుచుకున్నాడు కూడా. ఇక చూడగానే ఆకర్షించే అందం ఆయనది.ఆకారణంగా లేడీస్ ఫాలోయంగ్ ఎక్కువ ఉండేది. నిజానికి హరనాథ్‌కు చిన్నప్పుడు పైలట్ అవ్వాలని ఉండేదట.కానీ హరనాథ్ అందం, ఒడ్డు పొడుగు ఉన్న తేరు చూసి సినిమాల్లోకి వెళ్తే స్టార్ అవుతావు అంటూ ఎంకరేజ్ చేశారట ఫ్రెండ్స్.
ఇక తన చదువు పూర్తీ అయిన తర్వాత ఉద్యోగం ఏదైనా చేద్దామని మద్రాస్ బాట పట్టిన హరనాథ్‌ని చూసి ఆశ్చర్యపోయాడట దర్శక నిర్మాత గుత్తా రామినీడు.కుర్రాడు అందంగా ఉండటం వల్ల పిలిచి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగి, తను తీస్తున్న ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959) సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారట.ఇందులో అప్పటికే స్టార్ స్టేటస్ చూస్తున్న జమున హరనాథ్ కి జోడీగా నటించడం విశేషం. అయితే హరనాథ్ ‘ఋష్యశృంగ’అనే సినిమాతో మొదట కెమెరా ముందుకు వచ్చాడు.
ఇక పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరన్న సంగతి అందరికి తెల్సిందే. అలాంటి ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైలురాయి లాంటి చిత్రం ‘సీతారామ కళ్యాణం’. ఇందులో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్ర పోషిస్తూ, రాముడి పాత్ర కోసం సరికొత్త నటుడి కోసం వెతుకుతున్నారట .అలా చూస్తుండగా ఒకరోజు పాండీ బజార్‌లోని ఓ షాపులో హరనాథ్ కనిపించగా, ఆయన్ని గమనించి‘మా సినిమాలో రాముడి వేషం ఇస్తాను’ అన్నారు ఎన్టీఆర్ .అయితే మేకప్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే కెరీర్ పాడవుతుందేమోనని భయపడ్డాడు హరనాథ్.దాంతో నీ మీద నాకు నమ్మకం ఉందని ప్రోత్సహించాడు ఎన్టీఆర్. అలా తనే స్వయంగా ఆయన నుదుటన తిలకం దిద్ది రాముడిగా ఎంపిక చేశారు.
‘శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దము రారండి’ పాటలో
ఇకఈ సినిమాలో రాముడిగా హరనాథ్ రూపం ఎంతలా కుదిరిందంటే.. ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దము రారండి’ పాటలో ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేంతగా.అలా ఒక్క రాముడిగా నే కాదు ,కాదు, ఎన్టీఆర్ సలహా తో‘భీష్మ’ సినిమాలో హరనాథ్ శ్రీకృష్ణుడిగా కూడా నటించి మెప్పించడం విశేషం. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో పౌరాణిక పాత్రల్లో మెప్పించిన రాణించిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హరనాథ్.అలా తన సొంత తమ్ముడిగా అబుకొని వరుస అవకాశాలతో ప్రోత్సహించాడు ఎన్టీఆర్.అయితే రాముడి వేషంలో ఉన్నప్పుడు కూడా హరనాథ్ అలవాటు ఆపుకోలేక సిగరెట్స్ తాగేవాడట
also read:డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?
ఇక హరినాథ్ సినిమాల్లో 1961 నుంచి 1972 వరకు ఒక స్వర్ణయుగం చూశాడనే చెప్పాలి.తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి దాదాపుగా 167 సినిమాల్లో నటింఛి మెప్పించాడు హరనాథ్.ఇక ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘గుండమ్మ కథ’, ‘భక్త ప్రహ్లాద’, ‘లేత మనసులు’, ‘అమర శిల్పి జక్కన్న’, ‘సర్వర్ సుందరం’, ‘కథానాయిక మొల్ల’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయనకి మంచి పేరు తెచిపెట్టాయి.
దాదాపు 30 సినిమాలతో జమున-హరనాథ్ కాంబినేషన్
అయితే అలా దూసుకుపోతున్న క్రమంలోనే ఎదో ఒక వివాదం వల్ల ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జమునతో నటించడం మానేశారు. సరిగ్గా అదే సమయంలో వరుసగా దాదాపు 30 సినిమాలతో జమున-హరనాథ్ కాంబినేషన్ టాలీవుడ్‌లో రొమాంటిక్ జోడీగా మంచి పేరు తెచ్చుకుంది.అలా రొమాంటిక్ హీరోగా ముద్ర పడ్డ హరనాథ్ తో నటించాలని అప్పటి టాప్ హీరోయిన్లు కూడా పోటీపడేవారు .
అయితే మొదటి 50సినిమాలని పద్దతిగా చేసుకుపోయిన హరనాథ్ ఆ తర్వాత దారి తప్పాడు. మొదటి నుండి తాగడం అలవాటు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అదొక వ్యసనంలా మారిపోయింది. ఇక అతనికి తోడు ఎస్.వి. రంగారావు కూడా అతనికి జత కావడంతో ఇద్దరూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం సేవిస్తూ షూటింగులకు ఆలస్యంగా వెళ్లేవారు. దీంతో హరనాథ్ ని పెట్టుకోవాలంటే భయపడ్డ నిర్మాతలు క్రమ క్రమంగా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజుల వైపు మళ్ళారు.అయితే తను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ వద్దని వారించినప్పటికీ మొదట్లో మానినా ఆతర్వాత లెక్క చేయకుండా ఆ అలవాటునే కంటిన్యూ చేశాడు.అయితే హరనాథ్ ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది అతనికి తాగుడు అలవాటు చేశారనే ప్రచారం ఉంది.
1989 నవంబర్ 1న మద్రాస్‌లో కన్నుమూత
అయితే ఎంత తాగుడు అలవాటు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు, సహాయం చేస్తాడు అన్న పేరు ఉంది.అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అప్పటి హీరోలంతా హరనాథ్‌ను ఎంతో అభిమానించేవారట.దాంతో ఆయనకు సినిమా ఛాన్స్ లు లేకపోతె తమ సినిమాలలో అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని నిలబెట్టుకోలేదు హరనాథ్.ఇక చివరిరోజుల్లో ఎదో ఒక సినిమా అంటూ 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘నాగు’ సినిమాలో అసలు ఒక్క డైలాగ్ కూడా లేని తండ్రి పాత్రలో నటించారు హరనాథ్.అదే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైన హరనాథ్, కేవలం 53 ఏళ్ల వయసులోనే 1989 నవంబర్ 1న మద్రాస్‌లో కన్నుమూశారు.
హరనాథ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ !
ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఆయన భార్య పేరు భానుమతీదేవి, ఆమె 2015లో మరణించారు. హరనాథ్‌కు ఒక కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తె పద్మజ. పవన్ కళ్యాణ్‌తో ‘గోకులంలో సీత’, ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ వంటి చిత్రాలను నిర్మించింది శ్రీనివాసరాజే. కుమార్తె పద్మజ కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. ఇక వన్ కళ్యాణ్‌తో ‘తొలిప్రేమ’, సుమంత్‌తో ‘గోదావరి’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలను నిర్మించారు పద్మజ భర్త జి.వి.జి.రాజే.ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో సరైన క్రమ శిక్షణ లేకపోతె చివరి రోజులు ఎంత దుర్భరంగా సాగుతాయో చెప్పడానికి హరనాథ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ !