E-Paper
Advertisement

మళ్ళీ వెనక్కి వెళ్ళిన జననాయగన్ …వచ్చేది ఎప్పుడంటే ?

మళ్ళీ వెనక్కి వెళ్ళిన జననాయగన్ …వచ్చేది ఎప్పుడంటే ?
Advertisement

Jananayagan Delay:జననాయగన్…ఈ సినిమాని దళపతి విజయ్ ఏ ముహూర్తాన మొదలెట్టాడో కాని మూడడుగులు ముందుకు పడితే ముప్పై అడుగులు వెనక్కి పడుతుంది. అవును ….విషయం ఏంటంటే ఇదే నా  చివరి సినిమా అని విజయ్ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా జననాయగన్ సినిమా కున్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఎట్టి  పరిస్థితుల్లో తమ అభిమాన హీరో సినిమా చూసి తీరాల్సిందే అంటూ ఫిక్స్ అయిపోయారు దళపతి ఫ్యాన్స్. కానీ సినిమా సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుని దాదాపు ఏడు నెలల పాటు రిలీజ్ కానుందా ఆగిపోయింది.

ఇక్కడే అసలైన ట్విస్ట్

Advertisement

అయితే తాజాగా ఎన్నో చేంజెస్ తర్వాత ఎట్టకేలకి  సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్‌తో క్లియరెన్స్ తెచ్చుకుంది ఈ సినిమా.ఇంకేం సినిమా కి A సర్టిఫికెట్స్ వస్తేనేం లియో , సర్కార్ లాగా ఇది కూడా కలెక్షన్ల వర్షం కురిపించడం పక్కా అని రిలీజ్ కోసం రెడీ అయిపోయారు ఫ్యాన్స్. ఇక అనుకున్నట్టుగానే సినిమాని  జూలై 24, 2026 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కూడా. అయితే  ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చింది కేవీఎన్ ప్రొడక్షన్స్.అవును అబ్బే ఈ సినిమాని అనుకున్న జూలై 24కి వదలట్లేదు,మరో మంచి రోజు మహూర్తం చూసి రిలీజ్ డేట్ చెబుతామంటూ చల్లగా అనౌన్స్ చేసింది.

‘విశ్వరూపం’ టైంలోనూ ఇలాంటి వివాదాలే

Advertisement

నిజానికి  ఇలాంటి పొలిటికల్ డ్రామాలు పోస్ట్ పోన్ అవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా రిలీజ్ టైంలోనూ ఇలాంటి వివాదాలే కమల్ ని చుట్టు ముట్టాయి.ఇక ఇపుడు దళపతి  ‘జననాయగన్’కీ  అదే రిపీట్ అవుతోంది. ఇక ఈ సినిమా లో ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్ చుట్టూ వచ్చే ‘టీవీకే’ (TVK) డైలాగ్స్ రెఫరెన్స్‌లతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే కొన్ని సీన్లను సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ చెప్పడంతో మేకర్స్ వాటిని మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది. అయితేనేం  సినిమాలో విజయ్ మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్, పొలిటికల్ సెటైర్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఇప్పటి నుండే కాలర్ ఎగరేస్తునారు దళపతి ఫ్యాన్స్.

ఎలాంటి మెమరీస్ మిగులుస్తుందో ! 

ఇక ఈ సినిమాలో విజయ్ కి జోడీగా  పూజా హెగ్డే నటిస్తుండగా, బాలీవుడ్విలన్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్న సంగతి తెల్సిందే. ‘యానిమల్’తో తనదైన యాక్నటింగ్ తో సత్తా చాటిన  బాబీ, ఇందులో విజయ్‌తో డీ అంటే డీ అనే రేంజ్ లో నటించాబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.అలాగే ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించనుంది.ఇక వీరి తో పాటు సినిమాని తన మ్యూజిక్ ని మరో లెవెల్ కి తీసికెళ్ళబోతున్నాడు  రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.గతంలో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’, ‘మాస్టర్’, ‘లియో’ సినిమాలకు  కూడా ఈ బక్క మ్యుజీషియనే సంగీతం అందించాడు.చూడాలి మరి  ఎక్కడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండ తెరకెక్కించిన కేవీఎన్ ప్రొడక్షన్స్  కి ఈ సినిమా ఎలాంటి మెమరీస్ మిగులుస్తుందో !

Related News

స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ..వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’ కి ధనుష్ ‘తమిళ్ మురుగన్’ కౌంటరా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ మైథో వార్!

వామ్మో.. ఏంటీ అరాచకం.. ఒక్కో పోస్ట్ కి అన్ని లక్షలా.. శ్రీలీల డిమాండ్ మాములుగా లేదుగా?

భోగికి బోలెడు బడ్జెట్ కష్టాలు.. విభేదాలే కారణమా?

రక్త చరిత్ర -3 పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

Big Stories

Advertisement
×