E-Paper
Advertisement

స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ..వీడియో వైరల్!

స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ..వీడియో వైరల్!
Advertisement

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక చివరిగా రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను పలకరించిన ఈమె..ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.

ఎప్పటికీ రుణపడి ఉంటాను – భాగ్యశ్రీ..

ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా అభిమానులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్న వైనం అభిమానులను సైతం కంటతడి పెట్టించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది అభిమానుల ప్రోత్సాహమే అంటూ ఉద్వేగానికి గురైంది భాగ్యశ్రీ . ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ..” ఈరోజు నేను చాలా దుఃఖానికి లోనయ్యాను. అందుకే నా మనసులోని ప్రతి మాటను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన వ్యక్తి , మా దర్శకుడు మురళీ కిషోర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీరు గనక నాకు భారతి పాత్ర ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు నాకు ఇలాంటి ప్రశంసలు లభించేవి కాదు. నా మీద నమ్మకం ఉంచి నన్ను భారతిగా తెరపై నిలబెట్టినందుకు కృతజ్ఞతలు.

హైదరాబాద్ నా కర్మభూమి..

Advertisement

ఇక గత ఏడాదిన్నరగా నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కింద పడిపోయిన ప్రతిసారి నా అభిమానులు పంపిన మెసేజ్లు, రీల్స్, వారు చూపిన నిరంతర ప్రోత్సాహం నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది” అంటూ కన్నీటి పర్యంతమైంది. ఇక కన్నీళ్లను ఆపుకొని మరి ఆమె మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాదు నా కర్మభూమి.. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను “అంటూ కన్నీళ్లు పెట్టుకుంది భాగ్యశ్రీ మొత్తానికైతే ఈ పాత్ర , అభిమానులు తన పట్ల చూపించిన ప్రేమకు ఆమె ముగ్ధురాలయ్యింది. ఏది ఏమైనా గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న భాగ్యశ్రీ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది అని చెప్పవచ్చు.

పెళ్లికి సిద్ధమైన భాగ్యశ్రీ..

ఇదిలా ఉండగా మరొకవైపు భాగ్యశ్రీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాపిడ్ ఫైర్ ప్రశ్నలో అఖిల్ తో స్నేహం చేస్తానని చెప్పిన ఈమె .. పెళ్లి మాత్రం అతనితోనే అంటూ బుగ్గలు ఎరుపెక్కిన వేళ సిగ్గుతో కామెంట్లు చేసింది. తాను ఇప్పటివరకు చేసిన ప్రతి హీరో పెళ్లి అయిన వారే అని, అయితే ఒక హీరో మాత్రం మిగిలి ఉన్నారని, అతనితోనే తన పెళ్లి అంటూ కామెంట్లు చేసింది. ఇకపోతే గత కొంతకాలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని తో భాగ్యశ్రీ ప్రేమలో ఉంది అనే పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భాగ్యశ్రీ చేసిన కామెంట్లు ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది..మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Advertisement

ALSO READ:వామ్మో.. ఏంటీ అరాచకం.. ఒక్కో పోస్ట్ కి అన్ని లక్షలా.. శ్రీలీల డిమాండ్ మాములుగా లేదుగా?

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

రాముడి వేషంలోనే సిగరెట్లు.. ఎన్టీఆర్ ముందే అలా.. ఆ తప్పులే కెరీర్‌ను ముంచేశాయా?

టాలీవుడ్ బ్యూటీకి ఎండోమెట్రియోసిస్.. డాక్టర్ వింత సలహా!

మళ్ళీ వెనక్కి వెళ్ళిన జననాయగన్ …వచ్చేది ఎప్పుడంటే ?

‘గాడ్ ఆఫ్ వార్’ కి ధనుష్ ‘తమిళ్ మురుగన్’ కౌంటరా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ మైథో వార్!

వామ్మో.. ఏంటీ అరాచకం.. ఒక్కో పోస్ట్ కి అన్ని లక్షలా.. శ్రీలీల డిమాండ్ మాములుగా లేదుగా?

భోగికి బోలెడు బడ్జెట్ కష్టాలు.. విభేదాలే కారణమా?

Big Stories

Advertisement
×