Shine Tom chacko:నాని (Nani )హీరోగా నటించిన ‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko). ఈయనపై గత కొన్ని నెలలుగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ (Vincy Sony Aloshious)మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నటుడు షైన్ టామ్ చాకో ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. షూటింగ్ సమయంలో జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అని.. అయితే అది కావాలని చేసింది కాదు అని చెబుతూ ఆ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
నటికి బహిరంగ క్షమాపణ చెప్పిన షైన్ టామ్ చాకో..
అసలు విషయంలోకి వెళ్తే.. నటి విన్సీ సోనీ అలోషియస్, షైన్ టామ్ చాకో కలిసి నటించిన చిత్రం ‘సూత్రవాక్యం’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిస్సూర్ లోని పుతుక్కాడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న షైన్ టామ్ చాకో మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్ సెట్లో జరిగిన దానికి క్షమాపణలు కోరుతున్నాను. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ చేయలేదు. సరదాగా చెప్పాను. విన్సీకి ఎటువంటి హాని కలిగించే ఉద్దేశం నాకు లేదు. అయితే విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఎవరో ఆమెను బాగా ప్రోత్సహించారు” అని తెలిపారు.
నటి రియాక్షన్..
అయితే పక్కనే ఉన్న విన్సీ .. షైన్ టామ్ చాకో అలా బహిరంగంగా తనకు క్షమాపణలు చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను ఆరాధించే వ్యక్తి నుండి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. ముఖ్యంగా నేను స్పందించిన తీరు కూడా చాకో కుటుంబాన్ని ఎంతో బాధించింది. ఇప్పుడు ఈ వివాదం ముగిసిపోయింది.నిజానికి ఈ సంఘటనపై నేను కూడా విచారం వ్యక్తం చేస్తున్నాను. చాకో లాంటి ఒక వ్యక్తి నుండి అలాంటి అనుభవాన్ని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు వివాదం సమిసిపోయినందుకు సంతోషంగా ఉంది” అంటూ విన్సీ సోనీ అలోషియస్ తెలిపింది.ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు అంటూ విన్సీ సోనీ ఆరోపించింది. అంతేకాదు మలయాళ ఫిలిం ఛాంబర్ లో కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపైనే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు షైన్ టామ్ చాకో. ఏది ఏమైనా ఇద్దరి మధ్య ఇప్పుడు సమస్య సద్దుమణిగింది అని చెప్పవచ్చు.
ALSO READ:Tollywood: అజిత్ రేంజ్ లో వరల్డ్ వైడ్ గుర్తింపు.. ఈ హీరోయిన్ రికార్డ్స్ చూస్తే గుండె గుబేల్!