BigTV English

Brahmamudi Serial Today July 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: యామిని ప్లాన్‌ సక్సెస్‌ – ఏసీబీకి దొరికిన అప్పు  

Brahmamudi Serial Today July 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: యామిని ప్లాన్‌ సక్సెస్‌ – ఏసీబీకి దొరికిన అప్పు  

Brahmamudi serial today Episode: రాజ్‌ రెడీ అయి కిందకు రాగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. దీంతో రాజ్‌ ఏంటి అలా చూస్తున్నారు.. వేరే గ్రహం నుంచి వచ్చానా ఏంటి..? నేను మీ మనిషినే కదా..? నాన్నమ్మ మీ ఇంట్లో వంట చేసే పనిమనిషి పేరేంటి..? అని అడుగుతాడు.. లక్ష్మీ.. ఎందుకు..? అని ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో తను చేసిన పప్పులో ఉప్పు తక్కువ అయింది. వంకాయ కూరలో కారం ఎక్కువ అయింది. రైస్‌లో అయితే మొత్తం రాళ్లే వచ్చాయి. అంటే చేస్తున్న వర్కులో కాంసట్రేషన్‌ మిస్‌ అయింది. అందుకని తనని వంటమనిషి పోస్ట్‌ నుంచి తోటమాలిని చేస్తున్నాను అంటాడు రాజ్‌..


దీంతో అపర్ణ కన్పీజ్ గా అత్తయ్యా వీడు కొత్త రాజ్‌ ఆ.. పాత రాజ్‌ ఆ అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ అని చెప్తుంది ఇంద్రాదేవి. వీడి మాటతీరు బాడీ లాంగ్వేజ్‌ చూస్తుంటే.. ఏదో ట్రైనింగ్‌ ఇచ్చినట్టు లేదు అత్తయ్యా.. మర్చిపోయిన గతం కొద్దికొద్దిగా గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది అంటుంది అపర్ణ. నాకు అలాగే ఉంది అపర్ణ కానీ నువ్వు అప్పుడే బయటపడకు.. కొద్దిసేపు అబ్జర్వ్‌ చేయ్‌ అని చెప్తుంది. ఇంతలో రాజ్‌ మమ్మీ ఏంటి ఇద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు..ఎనీ ప్రాబ్లమ్‌.. ఏదైనా ఉంటే డైరెక్టుగా చెప్పండి అంటాడు. దీంతో ఇంద్రాదేవి డౌటు లేదు వీడు వాడే అనిపిస్తుంది అని గుసగుసలాడుకుంటుంటే.. రాజ్‌ వెకిలిగా నవ్వుతాడు. ఏంటి అందరూ షాక్‌ అయ్యారా.? భయపడ్డారు కదా..? నేనే కళావతి గారి నిజమైన బాస్‌ అని అందరూ నమ్మేశారు కదా అంటాడు.

దీంతో కళ్యాణ్‌ అవును అన్నయ్యా ఒక్క క్షణం నిజంగానే  వదిన వాళ్ల బాస్‌ మన ఇంటికి వచ్చారేమో అనిపించింది అంటాడు. నాకైతే ఇప్పటికీ మీరు రామా..? మా చెల్లి వాళ్ల బాసా అని తేల్చుకోలేకపోతున్నాను అంటుంది స్వప్న. దీంతో మరి నేనంటే ఏంటననుకున్నారు. సింగిల్‌ టేక్ ఆర్టిస్ట్‌ ఇక్కడ.. అంటాడు. చూస్తుంటే అర్థం అవుతుంది రామ్‌ నీ యాక్టింగ్‌ ప్రత్యేకించి చెప్పడం ఎందుకు అంటుంది రుద్రాణి. అత్తా కొన్ని సార్లు మన గురించి మనమే చెప్పుకోవాలి లేదంటే గుర్తింపు ఉండదు. ఏం కళావతి గారు మీరు ఇచ్చిన ట్రైనింగ్‌కు నేను ఇచ్చిన ఫెర్మామెన్స్‌కు షాక్‌ అయి షేక్‌ అయిపోయారా..? ఎలా ఉంది మన యాక్టింగ్‌.. ఇక మీరు ఏం టెన్షన్‌ పడకండి.. మీ ప్రాబ్లమ్స్‌ అన్ని సాల్వ్‌ అయిపోయినట్టే.. ఇక ఆఫీసుకు వెళ్దామా..? అంటూ ఇద్దరూ కలిసి ఆఫీసకు వెళ్లిపోతారు.


ఇద్దరూ కలిసి ఆఫీసు ముందు కారు దిగుతారు. నిన్న నేను ఆఫీసుకు వచ్చినందుకు చాలా టెన్షన్‌ పడ్డారు. కానీ అలా రావడం వల్లే నా భయం పోయి పుల్లు కాన్ఫిడెంట్‌ వచ్చింది అంటాడు రాజ్‌. అది ఓవర్‌  కాన్ఫిడెంట్‌ కాకుండా ఉంటే చాలు అంటుంది కావ్య. మీటింగ్‌లో ఎలా అదరగొడతానో మీరే చూస్తారు కదా అంటాడు రాజ్‌. మా బాస్‌ ఇలా ఎక్కువ మాట్లాడరు. తక్కువ మాట్లాడతారు ఎక్కువ చేస్తారు అని చెప్తుంది కావ్య. నేను మీ బాస్‌ ను కాదు కదా ఎక్కువ మాట్లాడతాను తక్కువ టైంలో వర్క్‌ ఫినిష్‌ చేస్తాను అంటాడు రాజ్‌ ఇంతలో యామిని కావ్యకు ఫోన్‌ చేస్తుంది. నేను కాల్‌ మాట్లాడి వస్తాను మీరు వెళ్లి మీటింగ్‌ స్టార్ట్‌ చేయండి అని చెప్తుంది కావ్య.

మీరు లేకుండా ఎలా వెళ్లగలను అంటాడు రాజ్‌. నేను అందరితో మాట్లాడాను.. మీరు వెళ్లండి అని చెప్తుంది కావ్య. ఇంతలో శృతి రావడంతో రాజ్‌ లోపలికి వెళ్లిపోతాడు. యామిని కోపంగా ఏంటి కావ్య కాల్‌ లిఫ్ట్‌ చేయడానికి ఇంత టైం తీసుకున్నావు నువ్వు ఎంత చేసినా ఈ రోజు గెలిచేది నేనే ఎందుకంటే సిద్దార్థ్‌కు రాజ్‌కు గతం గుర్తు లేదన్న విషయం చెప్పాను అంటుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఎదుటి వాళ్ల జీవితాలను లాక్కోవాలని చూసే నీకు ఇలాంటివి తప్పా ఇంకేం తెలుస్తుంది చెప్పు అంటూ కావ్య తిడుతుంది. దీంతో యామిని ఈరోజు నీకు ఇంకొక సర్పైజ్‌ గిఫ్ట్‌ కూడా ప్లాన్‌ చేశాను అదేంటో తెలుసుకో లేదంటే బోర్డు మీటింగ్‌లో నువ్వు ఓడిపోగానే నాకు కాల్‌ చేయ్‌ చెప్తాను అంటూ కాల్ కట్‌ చేస్తుంది. దీంతో కావ్య టెన్షన్‌గా స్వప్నకు కాల్‌ చేసి యామిని ఏదో ప్లాన్‌ చేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. తర్వాత అప్పుకు ఫోన్‌ చేసి యామిని చెప్పిన మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది.

మరోవైపు అప్పును ఏసీబీ వాళ్లకు పట్టించడానికి యామిని ఏర్పాటు చేసిన రౌడీలు ప్లాన్‌తో రెడీగా ఉంటారు. ఇంతలో ఏసీబీ ఆఫీసర్లు రాగానే రౌడీలు వెళ్లి వాళ్లతో ఆవిడ నిజంగానే లంచం అడిగిందని చెప్తారు. దీంతో ఏసీబీ వాళ్లు ఆ రౌడీలకు డబ్బులు ఇచ్చి ఇవి ఆవిడకు ఇచ్చే ముందు మాకు మెసేజ్‌ చేయండి అంటూ లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్లిన రౌడీలు అప్పుకు డబ్బులు ఇస్తూ.. ఏసీబీ వాళ్లకు మెసేజ్‌ చేస్తారు. ఏసీబీ వాళ్లు లోపలికి వచ్చి అప్పును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అరెస్ట్‌ చేసి కోర్టుకు తీసుకెళ్తారు.

మరోవైపు మీటింగ్‌ హాల్‌ లోకి వచ్చిన రాజ్‌ను చూసి బోర్డు మెంబర్స్‌ విష్‌ చేస్తారు. తర్వాత సిద్దార్థ్‌ డైరెక్టుగా కంపెనీ టర్నోవర్‌ తగ్గిపోయింది. అందుకోసం ఎండీని మార్చాలనుకుంటున్నాము అని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి బండారం బయటపెట్టబోతున్న నర్మద.. ధీరజ్ కు షాక్.. నగల గుట్టు బయట పడుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి వార్నింగ్ ఇచ్చిన భానుమతి.. ప్రణతికి తెలిసిన నిజం.. పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు మాటిచ్చిన మీనా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..ప్రభావతికి షాక్..

Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు కాల్‌ చేసిన ఇంద్రాదేవి – స్వరాజ్‌ను తీసుకొచ్చిన రాజ్‌

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒకటి వేరీ స్పెషల్..

Big Stories

×