Tollywood: సాధారణంగా హీరో హీరోయిన్లు సినీ పరిశ్రమలో నటనకు మాత్రమే తమ కెరియర్ ను అంకితం చేయరు. తమకు ఏ రంగంలో అయితే ప్యాషన్ ఉందో దానిని కూడా కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే అజిత్ (Ajith ) లాంటి హీరోలు ఒకవైపు ఆర్థికంగా ఎదగడానికి సినిమాలు చేస్తూనే.. మరొకవైపు తమకు ఇష్టమైన రంగంలో రాణిస్తూ సంచలనం సృష్టిస్తూ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఈయన లాగే ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకొని రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది ఒక హీరోయిన్. ఈమె తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఇప్పుడు తనకు ఇష్టమైన రంగంలో రాణిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఎవరో కాదు సయామీ ఖేర్ (Saiyami kher).
ట్రయథ్లాన్ పోటీలలో అరుదైన రికార్డు..
ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈమె విదేశాలలో నిర్వహించే ట్రయథ్లాన్ పోటీలలో పాల్గొంటుంది. అలా ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఐరన్ మ్యాన్ 70.3 మారథాన్ ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా కూడా రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ లో తొలిసారి మెడల్ అందుకున్న ఈమె ఇప్పుడు స్వీడన్ లో నిర్వహించిన రేస్ లో తన సత్తా చాటి మరో మెడల్ సొంతం చేసుకుంది. ట్రయథ్లాన్.. ఇందులో మూడు రేసులు ఉంటాయి 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్ , 90 కి.మీ సైక్లింగ్, 21.1 కి.మీ పరుగు ట్రయథ్లాన్ లో భాగం. అత్యంత కష్టమైన పోటీలలో ఇది కూడా ఒకటి. ఈ క్రమంలోనే దీనిని పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఈమె తాజాగా జులై 6న స్వీడన్ లోని జోంకోపింగ్ లో తన రెండు ఐరన్ మాన్ 70.3 ను విజయవంతంగా పూర్తి చేసింది. తొలిసారి కంటే రెండవసారి 32 నిమిషాల ముందే ఈ రేసును పూర్తి చేయడం విశేషం.
సయామీ ఖేర్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..
ప్రస్తుతం రేస్ పూర్తయిన తర్వాత ఇందుకు సంబంధించిన ఫోటోలను సయామీ ఖేర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె టాలెంట్ కి పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. అజిత్ ఎలా అయితే సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు తనకు ఇష్టమైన రేసింగ్ రంగంలో రికార్డులు సృష్టిస్తున్నారో.. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అలా రికార్డులు క్రియేట్ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సయామీకేర్ రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ తన టాలెంట్ తో అందరిని అబ్బురపరుస్తోంది.
సయామీ కేర్ సినిమాలు..
ఈమె తొలిసారి 2015లో ‘రేయ్’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ..ఇందులో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ (Sai Durga Tej)హీరోగా నటించారు. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఈమె..2021లో నాగార్జున (Nagarjuna) తో కలిసి ‘వైల్డ్ డాగ్’ మూవీలో NIA ఏజెంట్గా కనిపించింది. అంతేకాదు ఇటీవల వచ్చిన జాట్ అనే హిందీ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Finished my second Ironman 70.3. And my heart is full. ♥️✌🏽⁰Two races in ten months, while juggling a year full of work… and I’m reminded of one simple truth: discipline always beats excuses. People often ask why I put myself through this kind of torture. pic.twitter.com/jdTwfn44Vq
— Saiyami Kher (@SaiyamiKher) July 8, 2025