Nagarjuna: ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కూలీ. ఇది డైరెక్ట్ గా తెలుగు సినిమా కాకపోయినా కూడా ఇదివరకే దర్శకుడు అందించిన అద్భుతమైన సినిమాలు, అలానే రజినీకాంత్ సినిమా, రజనీకాంత్ తో పాటు పలు ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడంతో విపరీతమైన హైప్ ఈ సినిమా మీద ఉంది.
ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై అందరికీ ఒక క్యూరియాసిటీ నెలకొంది. అలానే ఈ సినిమా ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అన్నిటిని మించి అనిరుద్ అందించిన మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడ్డానికి సన్నగా కనిపించిన సినిమాకు మాత్రం బలమైన మ్యూజిక్ అందిస్తాడు. అందుకే ముద్దుగా తెలుగోళ్లంతా బక్కోడ పిలుచుకుంటారు.
ఆ బ్లాక్ బస్టర్ సినిమా
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాకు ముందు శివ సినిమా తర్వాత అని చాలా సందర్భాలలో మాట్లాడుకుంటారు. అంత పెద్ద ప్రభావాన్ని ఏకంగా ఇండస్ట్రీ పైన చూపించిన సినిమా శివ. ఈ సినిమా హై క్వాలిటీ విడుదలయితే చూడడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం అదే పనిలో ఉంది అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శివ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అలానే డబ్లీ సౌండ్ తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆగస్టు 14న విడుదల కాబోయే కూలి సినిమాకు అటాచ్ చేయనున్నారు.
బ్రహ్మరథం పడతారా
చాలామంది శివ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ సినిమాకి సంబంధించి మంచి హిస్టరీ ఉంది. ఈ సినిమా నుంచి చాలామంది నేర్చుకున్నాం అని దర్శకులు మాట్లాడుతారు. ఈ మాటలు విన్న తర్వాత శివ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే శివ సినిమాను థియేటర్లో చూడలేదు అనే వెలితి కొంతమందిలో ఉంటుంది. వారందరూ ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారా అనేది వేచి చూడాలి. అప్పట్లో కమర్షియల్ సక్సెస్ కానీ కొన్ని సినిమాలను ఇప్పుడు ఆదరించారు ప్రేక్షకులు. అలానే అప్పట్లో అంత కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా ఇప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Mahesh Babu: తమిళ్ సూపర్ స్టార్ తో పని అయిపోయింది, ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్