BigTV English

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Russian Girl: బెంగళూరులో ఒక రష్యన్ బాలిక నోట కన్నడ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్యన్ బాలిక తన తోటి స్నేహితురాలు కలిసి సైకిల్ తొక్కుతూ కన్నడ కవితను చెబుతోన్న వీడియో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు ‘బన్నడ హక్కి’ అనే ప్రసిద్ధ కన్నడ పిల్లల కవితను ఆనందంగా పాడుతూ బెంగళూరు వీధుల్లో సైకిల్ తొక్కుతున్నారు. ఈ వీడియోను రష్యన్ బాలిక తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది వారి ఇద్దరి మధ్య స్నేహం, భాషా సాంస్కృతిక బంధాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది.


ఈ ఇద్దరు బాలికలు మంచి స్నేహితులు. గత మూడేళ్లుగా ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. రష్యన్ బాలికకు చెందిన కుటుంబం 2022లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. అయితే ఈ వీడియో మొదలవ్వక ముందు, రష్యన్ కుటుంబం మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చినప్పటి నుంచి ఇద్దరు బాలికలను దిగిన ఫోటోలను కూడా పోస్ట్‌లో చేర్చారు. రష్యన్ బాలిక తల్లి వీడియోకు క్యాప్షన్‌గా, ‘భారతదేశంలో మూడేళ్లు.. క్లాస్ మేట్స్ – ఫ్రెండ్స్.. ఇది మూడేళ్ల స్నేహం’ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది.

?utm_source=ig_web_copy_link


ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీంతొ ఇది మరింత మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘బెంగళూరులో ఒక రష్యన్ బాలిక తన స్థానిక స్నేహితురాలితో కలిసి కన్నడ కవిత పాడటం చూడటం ఎంత ఆనందంగా ఉంది! విదేశీయులు కూడా మన భారతదేశ భాషలను నేర్చుకుంటున్నారు.. ఇది నిజంగా అద్భుతంగా ఉంది’ అని కామెంట్ చేశాడు. ఆ రష్యన్ చిన్నారి కన్నడ పాట ఎంత ముద్గుగా పాడుతుందో అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఆ పాప కన్నడ భాషలో పాడుతుంటే.. చూడడానికి ముద్దుగా ఉంది’ అని మరి కొంత మంది కామెంట్ చేసుకొచ్చారు.

ALSO READ: Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

పిల్లలకు భాష నేర్చుకోవడం సులభమని, ఎందుకంటే వారు ఉచ్చారణ గురించి ఆందోళన చెందరని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు, స్థానిక భాషలను పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని, దీని వల్ల భాష ప్రాముఖ్యత ఎంటో తెలుస్తోందని చెబుతున్నారు. ఓ నెటిజన్ ఇలా రాశాడు. ‘నేను రెండేళ్ల వయసులో నా మాతృభాషతో పాటు కన్నడం నేర్చుకున్నాను. కానీ చాలా మంది విదేశీయులు టెక్ హబ్‌లలో పనిచేస్తారు. అక్కడ కన్నడం మాట్లాడేవారు తక్కువగా ఉంటారు. కాబట్టి వారు భాషను నేర్చుకోలేరు’ అని రాశాడు. మరొకరు తమ అనుభవాన్ని పంచుకుంటూ… ‘నేను 40 నుంచి 50 కన్నడ పదాలు నేర్చుకున్నాను… కానీ ఆ భాషలో సంభాషించే వారు లేకపోవడంతో మర్చిపోయాను’ అని చెప్పారు. ఈ వీడియో స్థానిక భాషల పట్ల ప్రేమను, సాంస్కృతిక సమైక్యతను పెంపొందించడంలో స్నేహం.. పాఠశాలలో వాతావరణం ప్రాముఖ్యతను తెలుపుతోంది.

ALSO READ: IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×