Shruti Haasan : కొన్ని సినిమాలు రిలీజ్ కాకముందే విపరీతమైన అంచనాలను సాధిస్తాయి. అలాంటి సినిమాలలో ధనుష్ శృతిహాసన్ కలిసిన నటించిన త్రీ సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరగడానికి కారణం “కొలవరి డి” అనే పాట. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ పాటను పాడాడు అని అప్పట్లో న్యూస్ వచ్చిన వెంటనే విపరీతంగా ఈ పాట వైరల్ అయిపోయింది.
త్రీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. ప్రస్తుతం అనిరుద్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు తెలుగు దర్శకులు కూడా అనిరుద్ని సంగీత దర్శకుడుగా పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి
కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కావు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాలకు మంచి స్టేటస్ వస్తుంది. అలా ధనుష్ నటించిన త్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఊహించని సక్సెస్ సాధించలేదు. కానీ రీసెంట్ గా రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ఈ విషయం పైన శృతిహాసన్ కూడా స్పందించారు. త్రీ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ కావాలి. అప్పట్లో ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేశాము. ఇప్పుడు లాగా పాన్ ఇండియా, ఓటిటి లేవు కాబట్టి ఆ సినిమాకు సరైన సక్సెస్ రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమా విషయంలో మంచి సక్సెస్ రాలేదు అని కొద్దిపాటి అసంతృప్తి తనకు ఉన్నట్లు శృతిహాసన్ తెలిపారు.
కూలీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు
కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎదురు చూస్తున్న సినిమా కూలీ. లియో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. అన్ని ఇండస్ట్రీలు నుంచి పెద్దపెద్ద స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముగ్గురు దిగ్గజ నిర్మాతలు ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు.
Also Read : Shruti Haasan : నేను ఐరన్ లెగ్ కాదు, కానీ ఎందుకలా మాట్లాడుతున్నారు ?