Shruti Haasan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్ లు ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్లు ఎంతవరకు ఇండస్ట్రీలో నిలబడ్డారు అనేది పక్కన పెడితే. కొంతమంది మాత్రం వరుస డిజాస్టర్ సినిమాలు చూశారు. వరుసగా డిజాస్టర్ సినిమాలు విడుదలవుతున్న తరుణంలో వాళ్లపైన వచ్చే ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్ గా చేశారు. రామ్ చరణ్, రానా, ప్రభాస్ వంటి హీరోలు ఈ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. మంచు లక్ష్మి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. జగదేకవీరుడు అతిలోకసుందరి, మగధీర సినిమా కలిస్తే ఎలా ఉంటాయో, ఈ సినిమా అలా ఉండబోతుంది అని అప్పట్లో ప్రమోషన్ చేశారు. కానీ ఈ సినిమా మినిమం సక్సెస్ కూడా అందుకోలేకపోయింది.
నేను ఐరన్ లెగ్ కాదు
అనగనగా ఒక ధీరుడు సినిమా తర్వాత శృతిహాసన్ నటించిన సినిమా ఓ మై ఫ్రెండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి. ఎందుకంటే ఇదివరకే దిల్ రాజు, సిద్ధార్థ కాంబినేషన్లో బొమ్మరిల్లు సినిమా వచ్చింది కాబట్టి. ఈ సినిమాతో వేణు శ్రీరామ్ దర్శకుడుగా పరిచయమయ్యాడు. మొత్తానికి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తమిళ్లో వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇక్కడితో శృతిహాసన్ ను అందరూ ఐరన్ లెగ్ అనడం మొదలుపెట్టారు. దీనిపై శృతిహాసన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. నన్ను అందరూ ఐరన్ లెగ్ అన్నారు. బట్ నేను తెలుగులో చేసిన రెండు సినిమాల్లో ఒకరే హీరో సిద్ధార్థ్. తనను ఎవరూ ఏమీ అనలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో నాకు మంచి సక్సెస్ వచ్చింది.
బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ శృతిహాసన్. మొదట శృతిహాసన్ గురించి చాలా చర్చలు జరిగాయి. నిర్మాత బండ్ల గణేష్ హీరోయిన్ గా ఈమె వద్దు సార్ హిట్స్ లేవు అని చెప్పినప్పుడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నువ్వేమైనా ఇంతకుముందు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసావా అని అడిగారట. మొత్తానికి హరీష్ శంకర్ ఛాయిస్ తో శృతిహాసన్ ఈ సినిమాలో హీరో ఇంకా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సక్సెస్ వచ్చిన వెంటనే అందరూ గోల్డెన్ లెగ్ అనడం మొదలుపెట్టారు.
Also Read: Peddi Song : చరణ్ కోసం జానీ గ్రాండ్ గా ప్లాన్ చేశాడు, 100 డాన్సర్స్, 1000 మంది జూనియర్స్