Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి హాసన్.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె మొదట్లో ఒకటి, రెండు సినిమాలతో ఐరెన్ లెగ్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనగనగా ఓ ధీరుడు మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ చేసింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా ఈయనతోనే ఎక్కువ సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. అయితే శృతి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..
పవన్ కళ్యాణ్ పై శృతి కామెంట్స్…
రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి శృతి హాసన్ హాజరు అయ్యారు. ఈ క్రమంలో శృతి హాసన్ ని యాంకర్ సుమ పలు ప్రశ్నలు అడిగింది. ఆమె మాట్లాడుతూ మీతో పని చేసిన తెలుగు హీరోల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ హీరోల నుండి మీరు ఏది కోరుకుంటారో చెప్పండని అడుగుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వర్డ్స్ మీ మాటల్లో చెప్పమని అడిగింది. డానికి సమాధానం చెప్పిన శృతి. ఆయన నుంచి ఏమి తీసుకోలేము, దొంగిలించలేము అని అన్నది. ఆయన దగ్గర ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఆయనకీ మాత్రమే సూట్ అవుతాయిఅని అంటుంది. పవన్ కళ్యాణ్ పై ఇలాంటి మాట్లాడంతో శృతి హాసన్ వివాదాలను కోరి తెచ్చుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.
Also Read : ఆ ఓటీటీలోకే ‘మహావతార్ నరసింహ’.. స్ట్రీమింగ్ అప్పుడే..?
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..
ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కమిటీ అయిన చిత్రాలను వరుసగా పూర్తి చేస్తున్నాడు.. ఈ క్రమంలో ఇటీవలే హరిహర వీరమలు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓజీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అలాగే హరిష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అటు శృతిహాసన్ కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు తన లైవ్ ఈవెంట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం తన కెరీర్ పై ఫోకస్ పెడుతుంది. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుంది.