OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్స్, డార్క్ రొమాన్స్ స్టోరీలు తీవ్రమైన టెన్షన్, షాకింగ్ ట్విస్ట్ లు, టర్న్ లతో అభిమానులను ఆకర్షిస్తాయి. అందులోనూ ఇలాంటి జానర్ కు కొరియన్ మూవీ అనే ట్యాగ్ యాడ్ అయితే ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఒకవైపు భయపెట్టే క్రైమ్ స్టోరీ, మరోవైపు విచిత్రమైన ప్రేమ కథ, మధ్యలో టెక్నాలజీ టెర్రర్ ఉండే స్టోరీ కావాలంటే, ఈ సిరీస్ మీ కోసమే. ఈ సిరీస్ ఒక డేటింగ్ యాప్‌తో ముడిపడిన హత్యలతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. మరి ఈ కొరియన్ క్రైమ్ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చో, దాని కథ ఏంటో తెలుసుకుందాం రండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘Somebody’. 8 ఎపిసోడ్‌లతో నడిచే ఈ సిరీస్ జంగ్ జి-వూ దర్శకత్వంలో రూపొందింది. 2022లో రిలీజ్ అయిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో కిమ్ యంగ్-క్వాంగ్ (సియోంగ్ యున్-ఓ), కాంగ్ హే-లిమ్ (కిమ్ సమ్), కిమ్ యోంగ్-జి (లిమ్ మోక్-వోన్), కిమ్ సూ-యియోన్ (యియోంగ్ గి-యున్), చోయ్ యూ-హా (సమంత జంగ్, స్పెక్ట్రమ్ CEO) నటించారు. ఈ సిరీస్ బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ రాసిన “అమెరికన్ సైకో” నవల నుండి స్ఫూర్తి పొందింది. కిమ్ యంగ్-క్వాంగ్ సైకోపాత్ పాత్రలో కాంగ్ హే-లిమ్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. సినిమాటోగ్రఫీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 2022లో విడుదలైన ఒక యూనిక్ కొరియన్ డ్రామాగా నిలిచింది ఈ సిరీస్.
స్టోరీలోకి వెళ్తే…
కథ కిమ్ సమ్ (కాంగ్ హే-లిమ్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక గొప్ప సాఫ్ట్‌వేర్ డెవలపర్. “సమ్‌బడీ” అనే డేటింగ్ యాప్‌ను సృష్టిస్తుంది. ఇది ఆమె తయారు చేసిన AI చాట్‌బాట్‌పై ఆధారపడి పని చేస్తుంది. సమ్‌కు ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉంది. దీని వల్ల ఆమెకు ఇతరులతో కమ్యూనికేషన్ కష్టంగా ఉంటుంది. కానీ ఆమె స్నేహితులు లిమ్ మోక్-వోన్ (కిమ్ యోంగ్-జి) అనే షమన్, యియోంగ్ గి-యున్ (కిమ్ సూ-యియోన్) అనే వీల్‌చైర్‌లో ఉండే డిటెక్టివ్ ఈ యాప్ ద్వారానే మర్డర్ కే గురవుతారు.
Read Also : ఛీఛీ ఇదేం సినిమారా బాబూ… డైరెక్టర్ ను జైలుకు కూడా పంపిన మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?