BigTV English

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : కొరియన్ క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, ఎమోషనల్ కథలు ప్రేక్షకులను టెన్షన్‌తో కట్టిపడేస్తాయి. అందుకే ఇలాంటి సినిమాలంటే చెవి కోసుకుంటారు ప్రేక్షకులు. ఒకేవేళ మీరు గనుక న్యాయం, ప్రతీకారం, సమాజానికి సంబంధించిన చీకటి సైడ్ ను చూపించే ఒక థ్రిల్లింగ్ స్టోరీ కోసం ఓటీటీలో వెతుకుతుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ సిరీస్ ఒక మిస్టీరియస్ ప్రజా ఓటింగ్ వ్యవస్థ, హత్యలు, డార్క్ సీక్రెట్స్ తో నిండి ఉంది. ఈ ఉత్కంఠభరితమైన స్టోరీని ఏ ఓటీటీలో చూడొచ్చు? దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

పార్క్ షిన్-వూ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ పేరు ‘The Killing Vote’. 12 ఎపిసోడ్‌లు ఉన్న ఈ కొరియన్ సిరీస్ 2023లో తెరపైకి వచ్చింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది. ఇందులో పార్క్ హే-జిన్ (కిమ్ మూ-చాన్), పార్క్ సంగ్-వూంగ్ (క్వాన్ సియోక్-జూ), లిమ్ జి-యియోన్ (జూ హ్యున్), కిమ్ యూ-మి (మిన్ జి-యంగ్), షిన్ జంగ్-గియన్ (లీ మిన్-సూ), చోయ్ జిన్-హో (జి-హూన్) మెయిన్ రోల్స్ పోషించారు. ఈ సిరీస్ కాకావో వెబ్‌టూన్ “గుక్మిన్‌సాహ్యోంగ్‌టుప్యో” ఆధారంగా రూపొందింది. సిరీస్‌లోని యాక్షన్, సస్పెన్స్, పార్క్ సంగ్-వూంగ్ ఎమోషనల్ నటన బాగుంటాయి.


కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ ఒక డిస్టోపియన్ ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ న్యాయవ్యవస్థ దారుణంగా ఉండడంతో, నేరస్తులు ఈజీగా తప్పించుకుంటారు. “గేటల్” (డాగ్ మాస్క్) అనే మిస్టీరియస్ వ్యక్తి, 18 ఏళ్లు పైబడిన పౌరులకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఓటింగ్ పంపిస్తాడు. ఇందులో ఒక నేరస్తుడిని మరణశిక్షకు గురి చేయాలా వద్దా అని అడుగుతాడు. 50% కంటే ఎక్కువ మంది “అవును” అని ఓటు వేస్తే, గేటల్ ఆ నేరస్తుడిని చంపేస్తాడు.

ఈ కథలో మూడు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి: కిమ్ మూ-చాన్ (పార్క్ హే-జిన్) అనే సదరన్ పోలీస్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడర్; తన 8 ఏళ్ల కూతురు రేపిస్ట్‌ను చంపి జైలులో ఉన్న మాజీ లీగల్ స్కాలర్ క్వాన్ సియోక్-జూ; సియోల్ పోలీస్ సైబర్ సేఫ్టీ బ్యూరో ఆఫీసర్ జూ హ్యున్ ఆ ముగ్గురు. కథ మొదలయ్యే సమయంలో సియోక్-జూ గతంలో తన కూతురు హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వస్తుంది. అతను హంతకుడిగా భావించిన బ్యూన్ వూ-టాయెక్‌ను చంపినప్పటికీ, నిజమైన హంతకుడు లీ మిన్-సూ (షిన్ జంగ్-గియన్) అని, అతని తల్లి మిన్ జి-యంగ్ (కిమ్ యూ-మి) ఈ క్రైమ్‌ను కప్పిపుచ్చినట్లు తెలుస్తుంది. సియోక్-జూ జైలు నుండి గేటల్‌గా “కిల్లింగ్ వోట్” వ్యవస్థను నడిపిస్తూ, న్యాయం జరగని నేరస్తులను శిక్షిస్తాడు.

Read Also : ఫస్ట్ నైట్ రోజే పైకి పోయే నూతన వధువులు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా…

మూ-చాన్, జూ హ్యున్ గేటల్‌ను పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తారు. మిన్-సూ, గేటల్ వ్యవస్థను హైజాక్ చేసి, తన స్వార్థం కోసం ఉపయోగిస్తాడు. సియోక్-జూ తన కూతురు హత్యకు నిజమైన హంతకుడిని కనుగొని, అతన్ని కిల్లింగ్ వోట్ ద్వారా శిక్షించాలనుకుంటాడు, కానీ మిన్ జి-యంగ్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. చివర్లో, మిన్-సూ తన తల్లి చేతిలో చనిపోతాడు, సియోక్-జూ తనను తాను కిల్లింగ్ వోట్‌లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. మరి చివరకు ఏమైంది? క్లైమాక్స్ ఏంటి? అన్నది స్టోరీ.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×