Peddi Film : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సాధించుకున్న వ్యక్తి జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఢీ అనే షో తో మంచి పేరును సాధించుకున్నారు. ఆ షో లో జానీ మాస్టర్ ఎన్నో అవమానాలకు గురయ్యారు. కానీ ఆ షోలో అప్పుడు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళ కంటే కూడా ఇప్పుడు జానీ మాస్టర్ మంచి పొజిషన్ లో ఉన్నారు.
ఒక జానీ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై జానీ మీద తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. మొత్తానికి మళ్లీ జానీ తన పనిని చేసుకోవడం మొదలుపెట్టారు. జానీ మాస్టర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రామ్ చరణ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు అంటే ఆ పాట వేరే లెవెల్ లో ఉంటుంది. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
పెద్దిలో గ్రాండ్ సాంగ్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నారు. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన వీడియో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక గ్రాండ్ సాంగును దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేశారు. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేస్తున్నారు. దాదాపు ఈ పాటలో వందమంది డాన్సర్లతో పాటు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండనున్నారు. ఇదివరకే రంగస్థలంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన జిగేల్ రాణి పాట ఏ స్థాయిలో ఫిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే సుకుమార్ సినిమాలో అంత మంచి సాంగ్ కొరియోగ్రఫీ చేసిన జానీ, ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సినిమాలో కూడా అంతకుమించి అవుట్ ఫుట్ వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా కొరియోగ్రాఫర్
తెలుగులో నితిన్ నటించిన ద్రోణ అనే సినిమాకి కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ కొరియోగ్రాఫర్ గా జానీ మంచి పేరు సాధించుకున్నారు. అయితే ప్రస్తుతం జానీ అంటే కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించారు. ప్రభుదేవా వంటి హీరోకి కూడా కొరియోగ్రఫీ చేసే స్థాయికి వెళ్లిపోయారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఎన్నో సాంగ్స్ అద్భుతమైన వ్యూస్ సాధించాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. మొత్తానికి జానీ ఇప్పుడు చరణ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.
Also Read: Udaya Bhanu: ఉదయభానుని తొక్కేసింది ఆవిడే… నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు!