Shruti Haasan : రాఘవేందర్ రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
ఆ తరువాత ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమా కూడా అప్పట్లో ఊహించిన సక్సెస్ సాధించలేదు. వేణు శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమైన ఓ మై ఫ్రెండ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కు మంచి బ్రేక్ లభించింది.
తమిళ్ లో నన్ను ట్రోల్ చేశారు
బాలీవుడ్ పీపుల్ నా వాయిస్ లోని క్వాలిటీని ఇష్టపడ్డారు. తమిళ సినిమాల్లో స్టార్టింగ్ లో నా వాయిస్ కి చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు. దానికి కారణం డీప్ అండ్ డిఫరెంట్ గా ఉండడం. కానీ హిందీలో నాకు ఆ పాజిటివిటీ ఉంది. ఎందుకంటే రాణి ముఖర్జీ,సుస్మితాసేన్ వంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. నన్ను తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పమని చెప్పింది నాగ అశ్విన్. అది పిట్ట కథలు అని సిరీస్ కోసం. అలా నాగ అశ్విన్ చెప్పిన తర్వాత చాలామందికి నేను తెలుగులో డబ్బింగ్ చెబుతాను అని అర్థమైంది. ఆ తర్వాత నేను చేసింది ఒకటే సినిమా సలార్. సలార్ డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. ఇప్పుడు కూలి సినిమాకు కూడా అన్ని భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను అంటూ తెలిపారు శృతిహాసన్.
కూలీ సినిమా ప్రమోషన్స్
లోకేష్ కనగారాజ్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ కూలీ సినిమా ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది శృతిహాసన్. రీసెంట్గా తెలుగులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను రివిల్ చేసింది. కూలీ సినిమాలో సత్యరాజ్ కూతురుగా ప్రీతి అనే పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగులో ముగ్గురు ప్రముఖ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తన పాటలతో మంచి హైప్ ఈ సినిమా మీద క్రియేట్ చేశాడు.
Also Read: PrithviRaj Sukumaran : పొరపాటున ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా సర్ప్రైజెస్ చెప్పేసిన పృథ్వీరాజ్ సుకుమారన్