IND VS ENG, 4Th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో మూడు రోజులు పూర్తయ్యాయి. నేటితో.. మూడు రోజులు పూర్తికాగా మరో రెండు రోజుల పాటు మ్యాచ్ కొనసాగనుంది. అయితే ఇవాళ మ్యాచ్ ముగిసే సమయానికి 135 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 7 వికెట్లు నష్టపోయి 544 పరుగులు చేసింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న ఇంగ్లాండు.. తుక్కు రేగ్గొట్టింది.
సచిన్, రికి పాంటింగ్ రికార్డులకు ఎసరు పెట్టిన రూట్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో… డేంజర్ ఆటగాడు జో రూట్ అదిరిపోయే బ్యాటింగ్తో రెచ్చిపోతున్నాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన జో రూట్… ఏకంగా 150 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అలాగే… ఇందులో 14 బౌండరీలు ఉండగా… 60 స్ట్రైక్ రేట్ తో.. టెస్ట్ మ్యాచ్ కు కావలసిన ఇన్నింగ్స్ అందించాడు. అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రూటు… 13వేల పరుగులను క్రాస్ చేస్తున్నాడు. మరో 90 పరుగుల వరకు చేస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే ప్రమాదం పొంచి ఉంది. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ను కూడా… ఏడాది సమయంలో రూట్ బీట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత పాంటింగ్ 13378 పరుగులతో రెండో స్థానంలో ఉండాలి. ప్రస్తుతం రూట్ 13,289 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
ఇండియాకు చుక్కలు చూపిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు
నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మూడవరోజు ఫినిష్ అయ్యేసరికి 135 ఓవర్లు ఆడి… 7 వికెట్లు నష్టపోయి 544 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ లో… క్రాలి 84 పరుగులు చేయగా బెన్ డకేట్ 94 పరుగులు చేశాడు. పోప్ 71 పరుగులతో దుమ్ము లేపాడు. జో రూట్ 150 పరుగులు చేయగా బ్రూక్ ఒక్కడే మూడు పరుగులతో సరిపెట్టుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్ బ్యాటింగ్కు వచ్చి 77 పరుగులతో కొనసాగుతున్నాడు. రేపు కూడా అతడు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అంతకు ముందు మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 358 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక టీమిండియా బౌలర్లలో… బుమ్రా ఒకే ఒక్క వికెట్ తీసుకోగా అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ ఒక వికట్… రవీంద్ర జడేజా రెండు వికెట్లు అలాగే వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు.