PrithviRaj Sukumaran : మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను మలయాళం లో తీసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు వెతుక్కుని మరీ చూశారు. రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా బాగుంది అంటే భాషతో సంబంధం లేకుండా చూడటం అలవాటు చేసుకున్నారు చాలామంది ప్రేక్షకులు. అలానే చాలామంది మలయాళం హీరోలు సినిమాలను చూడటం ఫినిష్ చేశారు.
అన్ని భాషల్లో సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడటం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక హీరోను ఆ సినిమాలో పెట్టడం అలవాటు చేసుకున్నారు కొంతమంది దర్శకులు. అలానే మిగతా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పని చేయటం అలవాటు చేసుకున్నారు తెలుగు దర్శకులు.
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ప్రముఖ నటులు
రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా గురించి కీలక అంశాలు బయటపెట్టేసాడు. నాకు తెలుసు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో టోవినో థామస్ అలానే బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ప్రశాంత్ నీల్ వాళ్ళని బాగా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్లు అసలైన యాక్టర్స్ అంటూ మాట్లాడారు. ఏదో టాపిక్ లో సందర్భానుగుణంగా ఇది మాట్లాడి సారు. కానీ డ్రాగన్ సినిమాలో ఇంతమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు అని మొదటిసారి బయటకు వచ్చింది. చాలా జాగ్రత్తగా దాచి ఉంచిన ఈ విషయాన్ని పొరపాటున పృథ్వీరాజ్ చెప్పేశారు.
టైటిల్ లీక్ చేసిన జక్కన్న
కొన్ని సందర్భాలలో అనుకోకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అలానే ఈ సినిమా విషయంలో చాలా జరిగిపోయాయి. జపాన్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఏ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అని ఒకరు అడిగిన సందర్భంలో ఎస్.ఎస్ రాజమౌళి మాట్లాడుతూ…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా గురించి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని తెలిపారు. అయితే అప్పటికి డ్రాగన్ సినిమా గురించి అప్డేట్ ఎవరు ఇవ్వలేదు. ఆ టైటిల్ కూడా రివీల్ చేయలేదు. ఒకసారిగా జక్కన్న ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పేసరికి అందరికీ డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయింది అనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరోసారి పృథ్వీరాజ్ కూడా టైటిల్ కన్ఫామ్ చేసేసారు.
Also Read: Fauji Update : స్పీడ్ పెంచిన ప్రభాస్, ఎప్పుడెప్పుడు ఏ షూటింగ్ అంటే ?