Bigg Boss: బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్.. ఈ ప్రముఖ రియాల్టీ షో హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఒక నటి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బిగ్ బాస్ ప్రాజెక్ట్ హెడ్ వెల్లడించారు. ముఖ్యంగా బ్రేకప్ బాధలో ఉన్న నటి దాని నుండి బయటపడడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందని తెలిపిన ఆయన.. హౌస్ లో ఉన్న నటుడు ఆమెకు దగ్గరై ప్రేమిస్తున్నట్లు నటించాడట. ఇక అసలు విషయం తెలుసుకున్న ఆ నటి తట్టుకోలేక కత్తితో బాత్రూంలోకి వెళ్లడాన్ని గమనించిన బిగ్ బాస్ బృందం అడ్డుకొని, ఆమెను కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రేమలో విఫలం.. హౌస్ లో ఆత్మహత్యాయత్నం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బిగ్ బాస్ మేనేజ్మెంట్ హెడ్ ఈ విషయంపై స్పందిస్తూ విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.. బిగ్ బాస్ రియాల్టీ షో మేనేజ్మెంట్ సంస్థ ఎండమోల్ షైన్ ఇండియా ప్రాజెక్ట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ (Abhishek Mukherjee) స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. “బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 లో పాల్గొన్న ఒక నటి ప్రేమలో విఫలమయ్యింది. అయితే ఆ బాధ నుండి బయటపడడానికి ఆమె హౌస్ కి వచ్చింది. అయితే హౌస్ లో ఉన్న ఒక నటుడు కేవలం ఫేమ్ , ఓట్ల కోసమే ఆమెతో ప్రేమాయణం నడిపించాడు. అతడిది నిజమైన ప్రేమ అని నమ్మిన ఆమె.. ఆఖరికి అసలు విషయం తెలుసుకొని తట్టుకోలేకపోయింది. ఒకరోజు తెల్లవారుజామున తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె కత్తి తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది.. అయితే ఆ విషయాన్ని మా బృందం గమనించి వెంటనే అప్రమత్తమయి ఆమెను అడ్డుకున్నాము.
కౌన్సిలింగ్ కూడా ఇప్పించాము..
అయితే ఆమెను మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాము. సుమారు వారం రోజులపాటు ఆమె మానసిక వైద్యుడి సంరక్షణలోనే ఉంది. ఇక ఆమె మనసు కుదుటపడ్డాక షో నుంచి బయటకు పంపించేసాము” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 అప్పట్లో వివాదాస్పదంగా నడిచిన విషయం తెలిసిందే. నిజానికి ఎప్పుడైతే తమిళ్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ ప్రారంభం అయ్యిందో అప్పటినుంచి వివాదాలతో అట్టుడుకుతోంది అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇంటా బయట ఈ షోకి తమిళనాట పలు చిక్కులు వరుసగా ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. స్టార్ హీరో కమలహాసన్(Kamal Haasan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ వివాదాలకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని చాలామంది తమిళ్ బిగ్ బాస్ ప్రియులు కూడా కామెంట్లు చేశారు.
ఆత్మహత్యాయత్నం చేసుకున్న నటి ఎవరంటే?
ఈ క్రమంలోనే 2019లో తమిళ బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో హాస్యనటి మధుమిత(madhumita ) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ‘ఒరు కల్ ఒరు కన్నాడి’ అనే చిత్రంలో హాస్య పాత్రలో నటించిన ఈమె.. బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. 50 రోజులకు పైగా హౌస్ లో ఉన్న ఈమె హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. దీనితో ఆమెను హౌస్ నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు బయటకు పంపించేశారు.