Intinti Ramayanam Today Episode july 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ని ఎలాగైనా ఒప్పించాలని భానుమతి ప్రయత్నిస్తుంది కానీ అక్షయ్ ఒప్పుకోడు.. ఇక రాత్రి కమల్ ఇంటికి నేను రాను అని చెప్పాను కదా అని కమలాకర్ వేషంలో వచ్చి చెప్తాడు. నేను నా కొడుకు మనవరాలు దగ్గరే ఉన్నాను నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయ్ ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను భానుమతి అని అంటాడు. నీకోసం నేను అక్కడికి వచ్చేస్తాను అని భానుమతి కూడా అంటుంది. ఇక ఉదయం భానుమతి నాకు వయసు అయిపోయింది నడుము నొప్పులు ఎక్కువ సేపు నిలబడుకోలేను ఏది చేయలేను నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని అంటుంది. నేను ఈయనకు తోడుగా ఇక్కడే ఉంటాను అంటే ఏం అవసరం లేదు నేను అక్కడికి వస్తానని అక్షయ్ అవనితో అంటాడు. మొత్తానికి అవని వాళ్ళ ఇంటికి వెళ్లడానికి అక్షయ్ ఒప్పుకుంటాడు. అక్షయ్ కేవం పెయిడ్ గెస్ట్ ఉంటానని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని అక్షయ్ కు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది.. అయితే కాఫీ కావాలని అడిగితే లేదు మీరు ఈ పాలు తాగండి అంత సెట్ అవుతుందని అంటుంది. అక్షయ్ తన దగ్గర ఉన్న బుక్ లో పాలకు ఎంత ఖర్చు అని లెక్క వేస్తాడు. అది చూసిన రాజేంద్రప్రసాద్ వాడు ఇక్కడి నుంచి వెళ్లేలోగా నీతో కలిసి పోయేలా చేసే బాధ్యత నాది అని అంటాడు. శ్రియ పల్లవిలు భోజనం దగ్గర గొడవ పడడం చూసి పార్వతి వాళ్ళ పై సీరియస్ అవుతుంది. మీ మొగుళ్ళు ఎందుకు తాగొస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఇలా ఉండడం వల్లే కదా వాళ్ళు తాగొస్తున్నారు అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కమల్ శ్రీకర్ ను చూసి షాక్ అవుతుంది. ఇలా తాగొస్తే మీ భార్యలు మీకు విలువిస్తారని పార్వతి ఇద్దరినీ చెంప పగలగొడుతుంది. మీరు ఎందుకు నా మాట వినడం లేదని పార్వతి అంటుంది. మీరు ఇంట్లోంచి వెళ్లదు అత్తయ్య మీ మాట వింటామని పల్లవి, శ్రీయాల అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
అక్షయ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయిందని డాక్టర్ చెప్పగానే అవని కంగారు పడిపోతుంది. ఈ సెలెన్స్ పెడుతూ ఉండండి ఈరోజు అంతా పెడితే సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. ఇక అవని అక్షయ్ ని దగ్గరుండి చూసుకోవాలని అందరితో చెబుతుంది. అక్షయ్ లేవబోతాడు అంతలోకే ఆరాధ్య వచ్చి ఏం కావాలి నాన్న అమ్మని పిలవమంటారా అని అడుగుతుంది.. లేదు వద్దు వద్దు నేను టాబ్లెట్ వేసుకోవాలి.. ఆ టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయో నేను తీసుకొస్తాను నాన్న. నీకు నయమయేంతవరకు అమ్మ మిమ్మల్ని చూసుకోవాలని అందరికీ చెప్పింది అని ఆరాధ్య అంటుంది
ఇక అవని వచ్చి అక్షయ్ కు టిఫిన్ తీసుకొస్తుంది. ఈ టిఫిన్ తినండి అని లేపి తినిపించబోతుంది. నేను ఇంటికి పెయిన్ గెస్ట్ గానే వచ్చాను. ఇప్పటివరకు చూసుకో నన్ను మల్లి నీ భర్తగా ఫీలయ్యి సేవలు చేయొద్దు అని అంటాడు. నేను వాష్ రూమ్ కి వెళ్లి తర్వాత తింటాను అని అక్షయ్ అంటాడు.. రాజేంద్రప్రసాద్ వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలని అనుకుంటారు. అక్షయ్ టిఫిన్ కింద పడేస్తే అవన్నీ వచ్చి మళ్లీ టిఫిన్ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది.
Also Read : రోహిణి దెబ్బకు ప్రభావతికి షాక్.. మీనా ప్రగ్నెంట్.. బాధపడుతున్న సత్యం..
మీకు ఎందుకండి శ్రమ నేనున్నాను కదా నాకు చెప్పండి. నేను చూసుకుంటాను మీకు తగ్గిన తర్వాత నీ పనులు మీరే చూసుకోండి అని అవని అంటుంది. ఇక పార్వతి అక్షయ్ అవనీ ఎక్కడ కలిసి పోతారని టెన్షన్ తో అక్షయ్ కి చాలాసార్లు ఫోన్ చేస్తుంది.. రాజేంద్రప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడు. అవని ఫోన్ లిఫ్ట్ చేసి వెటకారంగా పార్వతి అనే పేరును అడ్డుపెట్టుకొని మాట్లాడుతుంది. శ్రీకర్ కమల్ మాత్రం వదిన అమ్మకు బాగానే చెప్తుంది అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి ఇంటికి వస్తుంది. పార్వతికి అసలు నిజం చెప్తుందా? లేదా చూడాలి.