Free Electricity Scheme: ఈ ఏడాదిలో దాదాపు 80 శాతం పథకాలను అమలు చేసేందుకు ప్లాన్ చేసింది చంద్రబాబు సర్కార్. ఒకొక్కటిగా అమలు చేస్తూ పోతోంది. ఆగస్టులో మరో స్కీమ్ అందుబాటులోకి రానుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆగష్టు సెకండ్ వీక్‌లో అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఏపీ ప్రజలకు ఆగష్టు నెల పండుగ లాంటింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తి చేసుకుంది. పథకాల విషయంలో ఆలస్యం చేయకుండా అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగు స్కీమ్‌లను అమలు చేయనుంది. ఆగష్టు 2న అన్నదాత సుఖీభవ, 7న చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, 15న మహిళలకు ఉచిత బస్సు, చివరివారంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది.
చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. ఆగష్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం కావడంతో వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయం బయటకు తెలీకుండా తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ పథకంపై ఇప్పుటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. పవర్‌లూమ్ యూనిట్‌కి 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకంపై గత మార్చిలో కేబినెట్ లో చర్చ జరిగింది. ఆపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. కాకపోతే అమలు చెయ్యడానికి చాలా సమయం తీసుకుంది.
ALSO READ: వరుస అరెస్టులు.. లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి సంచలన నిజాలు
ఏపీ వ్యాప్తంగా దాదాపు 93 వేల మందికి పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారంతా ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు. పవర్ లూమ్ కి చెందిన 10,534 యూనిట్లకు ఉచితంగా కరెంటు లభించనుంది. ఈ పథకంతో చేనేతలు కరెంటు బిల్లుల కష్టాల నుంచి కొంత గట్టెక్కవచ్చు.
ఇప్పటికే ఇండియాతోపాటు విదేశాల్లో చేనేత వస్త్రాలకు బ్రాండ్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. దీనివల్ల కార్మికులకు కొంత మేలు జరగనుంది. భారతీయ వస్త్రాలకు విదేశాల్లో మాంచి డిమాండ్ ఉంది. తయారు చేసిన ప్రొడక్టును ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని పెట్టడం ద్వారా నేతన్నలకు ఆర్థికంగా కలిసిరానుంది.
దీనివల్ల ప్రతీ ఏటా రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ఇలాంటి మరిన్ని నిర్ణయాలను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదికాకుండా ప్రభుత్వం వైపు నుంచి భారీ ఆర్డర్లు వస్తే ఆయా కార్మికులకు ఇక తిరుగుందని అంటున్నారు.