Ravi Teja ART Theatre: మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ART(ఏషియన్ రవితేజ)సినిమాస్ పేరుతో అతిపెద్ద థియేటర్ను నిర్మించారు. ఎప్పుడో రెండేళ్ల క్రితమే ఆర్ట్ సినిమాస్‌ను ప్రకటించిర భారీ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా ఈ నిర్మాణం పూర్తి అయ్యి.. సినిమా ప్రదర్శనలకు సిద్దమైంది. హైదరబాద్ నగర శివారులోని వనస్థలిపురంలో ఈ భారీ థియేటర్ను నిర్మించారు. ఇప్పుడు దీని ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. ఇవాళ జూలై 30న ఈ మల్టీప్లెక్స్ కింగ్డమ్ చిత్రంతో గ్రాండ్గా ఒపెన్ కానుంది.
ఆర్ట్ థియేటర్ స్పెషాలిటీ ఇదే
ఇక రవితేజ సినిమా థియేటర్ కావడంతో ఈ మల్టీప్లెక్స్ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ థియేటర్ స్పెషాలిటీలు తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు థియేటర్లలో లోపల ఏర్పాటు కళ్లు చెదిరే ఇంటీరియల్ డిజైన్స్, బిగ్ స్క్రీన్స్ చూసి ప్రతి ఒక్కరు అబ్బో అనుకుంటున్నారు. వీటిని మహేష్ బాబు ఏఎంబీని మించి ఉందే అని సర్ప్రైజ్ అవుతున్నారు ప్రక్షకులు. తాజాగా ఈ థియేటర్ లోపలి వీడియోలు, ఫోటలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా అలాంటి అనభవాన్ని పొందాలంటే ఈ థియేటర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మొట్టమొదటి థియేటర్ ఇదే
కాగా సినీ అసమానమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రవితేజ ఆర్ట్ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని కోరుకునే మూవీ లవర్స్ని ఆకర్షించేలా అధునాతన టెక్సాలజీతో ఈ థియేటర్ నిర్మాణం జరిగింది. ఇందులో ఆరు స్క్రీన్ లు, అత్యాధునిక ఆడియో, వీడియో సిస్టమ్లతో అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని అందిస్తాయి. 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, 4k టెక్సాలజీలో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ని అమర్చారు. ఇక రాష్ట్రంలో డాల్బీ అట్మాస్ సౌండ్, 4కె టాక్నాలజీతో నిర్మించిన ఏకైక మల్టీప్లెక్స్ ఇదే కావడం విశేషం.
East Side lo Mass Jathara Ready!
ART Cinemas – Vanasthalipuram
6 Screens Opening on 31st July 2025 with #KingdomTrailer
Tomorrow is Pooja Ravi Teja anna coming
Mass Maharaja #RaviTeja Teja Entry tho Opening Shot!#RaviTeja ART#ARTCinemas#MassJatharaOnAug27th#KingdomBlast pic.twitter.com/U5nBJRz07u— Vinay prabha (@DirectorVinay3) July 29, 2025
దీంతో హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన థియేటర్గా ఇప్పుడు ఏషియన్ రవితేజ్ ఆర్ట్ సినిమాస్ మల్టీప్లెక్స్ నిలిచింది. ఇక హైదరాబాద్లోనే కాదు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ థియేటర్లు గ్రాండ్గా ఒపెన్ కానున్నాయి. ఇక అదునాతన సాంకేతికతో నిర్మించిన ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు (జూలై 24) ఈ థియేటర్ల ప్రాంరభించాలని అనుకున్నారు. అయితే కొన్ని పనులు పెండింగ్ ఉండటం వల్ల ప్రారంభించలేకపోయారు. మొత్తానికి మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న రవితేజకు కింగ్డమ్తో గ్రాండ్ వెల్కమ్ దొరికిందని చెప్పాలి.
Also Read: Prakash Raj: బెట్టింగ్ యాప్ కేసు–ముగిసిన ప్రకాశ్ రాజ్ ఈడీ విచారణ.. ఆయనను అడిగిన ప్రశ్నలు ఇవే!
ART Cinemas – Vanasthalipuram
6 Screens Grand Opening July 30th
Premium multiplex in the East Hyderabad Area..@RaviTeja_offl @ARTCinemasOffl#ARTCinemas #raviteja #MassJathara #RaviTeja pic.twitter.com/SFPfoLLrM3
— Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) July 29, 2025