SIIMA Awards 2025: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవార్డులను ప్రకటిస్తూ సినిమా సెలబ్రిటీలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డులలో సైమా అవార్డులు (SIIMA Awards)కూడా ఒకటి. ప్రతి సంవత్సరం ఈ అవార్డులను పురస్కరిస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ అవార్డు వేడుకలలో భాగంగా గత ఏడాది విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన సినిమాలు వివిధ కేటగిరీలలో నామినేషన్స్ కు ఎంపికయ్యాయి.
11 నామినేషన్స్ లో పుష్ప 2…
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల నుంచి గత ఏడాది విడుదలైన సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన సినిమాల జాబితాను బుధవారం విడుదల చేశారు. మరి ఈ జాబితాలో భాగంగా ఏ ఏ సినిమా ఎన్ని క్యాటగిరీలలో నామినేషన్ అయ్యింది అనే విషయానికి వస్తే.. ఏడాది సైమా అవార్డులలో భాగంగా పుష్ప2 (Pushpa 2)సినిమా ఏకంగా 11 నామినేషన్స్ లో నిలిచి సత్తా చాటిందని చెప్పాలి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన ఈ సినిమా కథ ఏడాది డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
మొదటి స్థానంలో పుష్ప 2…
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఇప్పటికే ఎన్నో అవార్డులు ఈ సినిమాకు సొంతం కాగా సైమా అవార్డులలో కూడా ఏకంగా 11 కేటగిరీలలో నామినేషన్స్ లో నిలిచింది. ఈ సినిమాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు కూడా సైమా అవార్డులలో సత్తా చాటాయి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి(Kalki) సినిమా ఏకంగా 10 నామినేషన్స్ తో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటుడు తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ (Hanuman)సినిమా కూడా 10 నామినేషన్స్ లో నిలిచింది.
దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్…
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా తమిళ చిత్రం అమరన్13, లబ్బర్ పందు 8, వాలై 7 నామినేషన్స్ లో నిలిచింది. ఇక కన్నడ సినిమా విషయానికి వస్తే..భీమా9, కృష్ణ ప్రణయ సఖి9, ఇబ్బని తబ్బిడ ఇలియాలి 7 నామినేషన్స్ లో నిలిచింది. ఇక మలయాళ సినిమాల విషయానికి వస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం 10 నామినేషన్స్ లో నిలిచింది. ఏ ఎమ్ ఆర్ 9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కించుకున్నాయి . ఇప్పటివరకు 12 సైమా అవార్డు వేడుకలు జరగగా ఈ 13వ సైమా అవార్డు వేడుకను సెప్టెంబర్ 5, 6 తేదీలలో దుబాయ్ వేదికగా ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇక ఈ సైమా వేడుకలలో భాగంగా తెలుగు సినిమాలో అత్యధికంగా నామినేషన్స్ లో నిలవడ విశేషం.
Also Read: Fish Venkat : డీజే టిల్లు సినిమా వల్లే ఫిష్ వెంకట్ చనిపోయాడా ? భార్య సంచలన కామెంట్స్