Kingdom Event: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా కింగ్డమ్. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా గురించి నాగ వంశీ విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు. ఏకంగా మీడియా ప్రముఖులకు ఈ సినిమా విషయంలో ఎన్ని వంకలు పెట్టుకుని వచ్చినా నేను సమాధానం చెబుతాను అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఈ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి ఈ సినిమాను రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్నారు. ఇది కావాలని చేసింది కాదు. ఈ కథను చెప్పినప్పుడే ఇలా చేయాల్సి వస్తుందని దర్శకుడు గౌతం నాగ వంశీకి క్లారిటీ ఇచ్చాడు. అయితే కింగ్డమ్ సినిమా కూడా ప్రాపర్ స్టార్టింగ్ అండ్ ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. పార్ట్ 2 లో చూడండి అనే అటువంటి సర్ప్రైజెస్ ఏమీ ఉండవు.
కింగ్డమ్ ఈవెంట్ కి క్లారిటీ
బాలాజీ అనే వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. తెలంగాణలో ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అని క్లారిటీగా చెబుతూ రైతులందరికీ ఉపయోగపడుతుంటాడు. ఇంత గొప్ప ఆలోచన తనకి రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా కొన్నిసార్లు ఇతనని అడుగుతూ ఉంటారు. తాజాగా నిర్మాత నాగ వంశీ, జులై 28న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో కింగ్డమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఆరోజు ఏమైనా వర్షం పడే అవకాశం ఉందా ఒకసారి చెప్పు, ఆ తర్వాత మేము చూసుకుంటాం అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ను నిర్మాత నాగ వంశీ అడిగాడు. దీనికి కొద్దిపాటి చినుకులు పడే అవకాశం ఉంది అని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే ఈవెంట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Hey @balaji25_t … We’re planning to conduct the Pre Release event of our #KINGDOM on 28th of july at Police Grounds, Yousufguda.
Konchem weather ela undo chusi chepthe, aa tarvata memu chooskuntam!! 😉
— Naga Vamsi (@vamsi84) July 22, 2025
ట్రైలర్ ఈవెంట్ తిరుపతిలో
ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత పలుసార్లు వాయిదా పడింది. మొత్తానికి జూలై 31న ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది రీసెంట్ టైమ్స్ లో ఆనవాయితీగా మారింది. అందుకనే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అలానే సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందుకున్నాయి. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read: Pawan Kalyan: ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్, మంచి ఐడియా వేశారు