BigTV English

Jr. NTR: ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన సింగర్… మనకు ఆ పరిస్థితి రావచ్చు అంటూ!

Jr. NTR: ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన సింగర్… మనకు ఆ పరిస్థితి రావచ్చు అంటూ!

Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్(Jr.NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి నటించిన వార్2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఈ సినిమాని అడ్డుకుంటాము అంటూ మాట్లాడిన ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు…

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad)ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఈయన ఎన్టీఆర్ ను బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు ఇక ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అలాగే తమ హీరోకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ విషయం ఏపీ రాజకీయాలలోనూ అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చలకు కారణమైంది.


ఇండస్ట్రీ మొత్తం మద్దతు ఇవ్వాలి…

ఇలా ఎమ్మెల్యేల మాటతీరు కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని మాట్లాడే ముందు జాగ్రత్తలు వహించాలి అంటూ అధినేత ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. తాజాగా ఈ విషయంలో ఎన్టీఆర్ కు సింగర్ అనుదీప్ (Singer Anudeep) మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు ఎన్టీఆర్ కు ఎదురైన సందర్భం రేపు మరో స్టార్ కు ఎదురు కావచ్చు. ఇలాంటి విషయాలలో మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిసికట్టుగా ఎన్టీఆర్ కు మద్దతు ఇవ్వాలని #Stand with NTR అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు”. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజకీయాలకు దూరంగా ఎన్టీఆర్…

ఇక ఎన్టీఆర్ గతంలో రాజకీయాల పట్ల ఆసక్తి చూపిన ఇటీవల కాలంలో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్న ఈయన పేరు మాత్రం తరచూ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వినపడుతూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి ఎక్కడ స్పందించలేదు.ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. అదేవిధంగా దేవర 2 చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై కొరటాల కానీ, ఎన్టీఆర్ కానీ ఎక్కడ స్పందించలేదు.

Also Read: Rashmika: అందరి ముందు విజయ్‌తో అలాంటి పని చేసిన రష్మిక.. వీడియో వైరల్

Related News

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Zubeen Garg: ప్రమాదం కాదు.. విషమిచ్చి చంపారు… సింగర్ కేసులో బిగ్ ట్విస్ట్?

Srinidhi Shetty: అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు.. డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?

Big Stories

×