Rashmika: రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పలు సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఇటీవల రష్మిక అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.. భారత 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పరేడ్ అయిన ఇండియా డే పరేడ్(India Day Pared) లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations)ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
అందరి ముందు ఆ పని ఏంటీ రష్మిక…
ఇక ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పరేడ్ లో పాల్గొన్న రష్మిక చూయింగమ్ నములుతూ కనిపించారు. అలాగే చూయింగమ్ పేపర్ తీసి అందరి ముందు విజయ్ దేవరకొండ పాకెట్ లో పెడుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలేషన్ లో రష్మిక విజయ్ దేవరకొండ..
ఇలా అందరి ముందు రష్మిక విజయ్ దేవరకొండతో ఎంతో చనువుగా ఉంటూ కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఎంతో గౌరవప్రదమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటూ ఇలాంటి పనులు చేయడం ఏంటి రష్మిక అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారని ఇప్పటికి తమ రిలేషన్ అలాగే కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.
#RashmikaMandanna spot on camera putting a chewing gum wrapper in #VijayDeverakonda's pocket. pic.twitter.com/49v4uQwPfO
— IndiaGlitz Telugu™ (@igtelugu) August 18, 2025
ఇలా తమ రిలేషన్ గురించి అధికారకంగా ప్రకటించకపోయిన వీరిద్దరూ మాత్రం చాలా చనువుగా మూవ్ అవ్వటం అలాగే వెకేషన్ లకు వెళ్లిన ఇద్దరూ కలిసి వెళ్లడం చూస్తుంటే కచ్చితంగా రిలేషన్ లో ఉన్నారని కానీ ఈ విషయంపై స్పందించడం లేదని, ఏ క్షణమైన వీరు తమ రిలేషన్ గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ పరేడ్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ రష్మిక చాలా సన్నిహితంగా మెలగడంతో ఈ వీడియోలు కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికొస్తే ఇటీవల కింగ్ డం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులకు కమిట్ అవుతూ ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక రష్మిక కూడా ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Nagarjuna: న్యూమరాలజీ పై నమ్మకం లేదు.. ఆ సినిమా వల్ల నమ్మాల్సి వచ్చింది!