E-Paper
Advertisement

ఆశా భోస్లే ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే!

ఆశా భోస్లే ఆస్తుల విలువ ఎంతో తెలుసా… ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే!
Advertisement

Asha Bhosle: ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (Asha Bhosle)సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వివిధ భాషలలో వేల సంఖ్యలో పాటలను ఆలపిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే నేడు ఈమె మరణించిన సంగతి తెలిసిందే. 92 సంవత్సరాల వయసు ఉన్న ఆశా భోస్లే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే గత రాత్రి ఈమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఈమె తుది శ్వాస విడిచారు. ఇలా వేల సంఖ్యలో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆశాభోస్లే లేరనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వందల కోట్ల ఆస్తి..

ఇక ఈమె మరణ వార్త తెలిసిన ఎంతోమంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈమె మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఈమె మరణించడంతో ఈమె సినీ ప్రస్థానం గురించి , వ్యక్తిగత జీవితం గురించి , ఆమె అందుకున్న అవార్డులు, ఆస్తి పాస్తులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. పలు నివేదికల ప్రకారం ఆశాభోస్లే సుమారు 100 కోట్ల రూపాయల నికర ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది.

విదేశాలలో రెస్టారెంట్లు..

Advertisement

ఇక ఈమెకు ఇండియాలో మాత్రమే కాకుండా దుబాయ్, అబుదాబి, కువైట్ , యు కే వంటి దేశాలలో ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ముంబైతో పాటు పూనే వంటి మహానగరాలలో విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. సుమారు 12వేలకు పైగా పాటలు పాడిన ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చిన డబ్బును పెద్ద ఎత్తున పెట్టుబడులుగా వ్యాపారాలలో పెడుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే వారని తెలుస్తుంది.

టాప్ 10 ధనవంతురాలిగా

Advertisement

తన సోదరీ లతా మంగేష్కర్ కంటే కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఆశాభోస్లే అందుకున్నారు. సింగర్ గా లతా మంగేష్కర్ కెరియర్ మొదట్లో ఒక్కో పాటకు 500 వరకు రెమ్యూనరేషన్ అందుకున్నప్పటికీ, ఆశాభోస్లే మాత్రం ఒక్కోపాటకు కేవలం రూ. 100 మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునే వారని గెలుస్తుంది. ఇలా సింగర్ గాను వ్యాపారవేత్తగా మంచి సక్సెస్ అందుకుని దేశంలోనే టాప్ 10 ధనవంతురాలిగా ఈమె చోటు సంపాదించుకున్నారు.

Also Read: ఫౌజీ…మూడు విభిన్న గెటప్స్ లో ప్రభాస్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం?

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×