E-Paper
Advertisement

10 నిమిషాల్లో చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్.. పిల్లల కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు!

10 నిమిషాల్లో చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్.. పిల్లల కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు!
Advertisement

Fruit Custard: తక్కువ సమయంలో.. అతి తక్కువ శ్రమతో ఇంట్లోనే అద్భుతమైన డెజర్ట్ తయారు చేయాలనుకుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే హెల్దీ రెసిపీ ‘ఫ్రూట్ కస్టర్డ్’. వేసవి కాలంలో చల్లచల్లగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. పండ్లు, పాలు కలిసి ఉండటం వల్ల ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అతిథులు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండుగ సమయంలో త్వరగా చేసుకోగలిగే బెస్ట్ స్వీట్ రెసిపీ ఇది.

కావాల్సిన పదార్థాలు..

ఈ రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి అర లీటరు చిక్కటి పాలు, మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ (వెనీలా ఫ్లేవర్ బాగుంటుంది), అర కప్పు చక్కెర, మీకు నచ్చిన పండ్ల ముక్కలు (ఆపిల్, అరటిపండు, దానిమ్మ గింజలు, ద్రాక్ష), కొన్ని డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి.

Advertisement

Also Read: మజ్జిగ చారు ఇలా చేస్తే.. అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు, బామ్మల కాలం నాటి రహస్యం ఇదే!

తయారు చేసుకునే విధానం..

ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు మరిగించి, ఆపై చక్కెర వేసి అది పూర్తిగా కరిగే వరకు ఉంచాలి.

Advertisement

ఈ మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆపి, దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో రెండు గంటల పాటు ఉంచితే మరింత రుచి వస్తుంది. చివరగా వడ్డించే ముందు అందులో తరిగిన పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే ఎంతో రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్ సిద్ధమవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఫ్రూట్ కస్టర్డ్ కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు.. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రకరకాల పండ్లు వాడటం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. పాలు ఉండటం వల్ల క్యాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఎండకాలంలో బాడీని చల్లబరచడానికి, తక్షణ శక్తిని ఇవ్వడానికి ఇదొక బూస్టర్ లాంటిది అనే చెప్పాలి.

Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×