Singer Chitra:సింగర్ చిత్ర (Singer KS Chitra).. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. భారత సినీ రంగంలో ప్రసిద్ధ నేపథ్య గాయనిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ‘దక్షిణ భారత నైటింగేల్’ అనే బిరుదును కూడా అందుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, హిందీ, బెంగాలీ ఇలా పలు భాషలలో సుమారుగా 25 వేలకు పైగా పాటలు పాడి సరికొత్త రికార్డు సృష్టించారు. 2005లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ , 2021లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్న ఈమె ప్రాంతాన్ని బట్టి ఒక్కో బిరుదును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈమెకు ఒక అవమానం జరిగిందట. ఈ విషయాన్ని చిత్రమ్మే స్వయంగా చెప్పుకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి చిత్రమ్మ మాటల్లో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
చిత్రకి ఘోర అవమానం..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ గాయని కే.ఎస్ చిత్ర సినీ ప్రస్తానానికి 45 సంవత్సరాలు. ఈ సందర్భంగా బెంగళూరులో ఇటీవల ఒక ప్రత్యేక వేడుక నిర్వహించారు. ముందు ఈమె ఒక హోటల్ కి వెళ్ళగా.. అక్కడ సిబ్బంది ఈమెను గుర్తుపట్టలేదట. ‘పియా బసంతి రే’ పాట పాడింది తానేనని చెప్పిన తర్వాత వారు ఆశ్చర్యపోయారని ఆమె చెప్పుకొచ్చింది. 45 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆమె గొంతు అంతలా ప్రాచుర్యం పొందింది. కానీ ఆమె రూపం గుర్తుపెట్టుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. చిత్ర తన గొంతుతోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే ఆమె గొంతుకు అభిమానులు ఉన్నారు కానీ ఆమె రూపానికి కాదు కదా అంటూ ఎవరికి వారు కామెంట్లు చేస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో బిరుదు..
ఇకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో బిరుదు కలిగి ఉన్న సింగర్ గా కూడా చిత్ర పాపులారిటీ దక్కించుకున్నారు. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా పియా బసంతి అని ఉత్తర భారత దేశంలో పిలుస్తారు. కేరళలో వనంబాడీ, ఆంధ్రప్రదేశ్లో సంగీత సరస్వతి, తమిళనాడులో చిన్న కూయిల్, కర్ణాటకలో కన్నడ కోగిల్ ఇలా పలు ప్రాంతాలలో తనకంటూ ఒక బిరుదును సొంతం చేసుకున్నారు.
చిత్ర బాల్యం విద్యాభ్యాసం..
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్ , తల్లి శాంతకుమారి. ఇద్దరి పేర్లు కలిసేలా తన పేరును పెట్టుకున్నారు. 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించారు. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఈమెకు.. అక్క బీనా, తమ్ముడు మహేష్ కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరిక ఉండగా.. అందులో బీనాకి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ అందించారు. అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. అలా నేర్చుకున్న సంగీతం నేడు ఆమెను ఉన్నత శిఖరానికి చేర్చింది అని చెప్పవచ్చు.
ALSO READ:Shilpa Shetty: 50ల్లో కూడా స్టిల్ యంగ్.. ఆ అలవాట్లే కారణం అంటున్న శిల్పా శెట్టి!