E-Paper
Advertisement

singer Janaki:ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకి.. అంత నరకం అనుభవించిందా?

singer Janaki:ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకి.. అంత నరకం అనుభవించిందా?
Advertisement

singer Janaki;సంగీత కళాకారిణి, గాన కోకిల ఎస్. జానకి మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 17 కు పైగా భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డులు సృష్టించిన ఎస్ జానకి.. ఎక్కువగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు పాడి శ్రోతలను అలరించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి..తమిళనాడు ప్రభుత్వం చేత కళైమామణి పురస్కారం పొందిన తర్వాత దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని.. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా ఆమె తిరస్కరించింది. ఇక 1957లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. 2016 సెప్టెంబర్ లో తాను పాడడం ఆపేస్తున్నట్లు చెప్పి.. రిటైర్మెంట్ ప్రకటించింది. గత పది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా కెరియర్ కొనసాగిస్తున్న జానకి.. జూలై 11 శనివారం మైసూర్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు.

జానకి ప్రేమ, పెళ్లి..

ఇకపోతే నేడు మైసూర్ లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులకు గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె ప్రేమ , పెళ్లి, ఆమె భర్త పట్ల ఆమె చూపిన ఆప్యాయత అన్నీ చూసి అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పెళ్లికి ముందు భర్త ఫోటో దాచుకున్న జానకి..

Advertisement

ఇక జానకి ప్రేమ , పెళ్లి, పిల్లల విషయానికి వస్తే.. దగ్గరి బంధమైన రామ్ ప్రసాద్ ను జానకి ప్రేమించి మరీ వివాహం చేసుకున్నట్లు గతంలో ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.” పెళ్లి కాకముందు ఎవరికీ తెలియకుండా ఆయన ఫోటోను నా దగ్గర దాచుకున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇక దగ్గర బంధువులు కావడంతో మా ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. అలా మా పెళ్లి 1959లో జరిగిపోయింది.. ఇక నేను నా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను నా భర్తే దగ్గరుండి మరీ చూసుకునేవారు. ముఖ్యంగా నా పాటల రెమ్యూనరేషన్, పాటల ఒప్పందాలు, రాయల్టీలను దగ్గరుండి చూసుకునేవారు. నేను నా భర్తను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు” అంటూ తన భర్తపై ప్రేమను వ్యక్తపరుస్తూనే తన ప్రేమ, పెళ్లి గురించి పలు కామెంట్లు చేసింది జానకి.

also read:అలాంటి జబ్బుతో బాధపడుతున్న యాంకర్ రష్మీ.. ఏదీ శాశ్వతం కాదంటూ!

ఆ నరకం వర్ణనాతీతం..

Advertisement

అదే ఇంటర్వ్యూలో జానకి మాట్లాడుతూ..” నా భర్తే నా సర్వస్వం ..నా భర్త చేతుల్లో ఈ లోకాన్ని వదిలి పెట్టాలని భావించాను. కానీ నాకంటే ముందే ఆయన మరణించారు అంటూ జానకి కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తానికైతే భర్తే సర్వస్వంగా బ్రతికిన జానకి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో ఆమె ఎంత నరకం అనుభవించిందో అంటూ అభిమానులు సైతం అసలు విషయం తెలిసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇకపోతే వీరికి మురళీకృష్ణ అనే ఒక్కగానొక్క కొడుకు జన్మించగా.. ఆ కొడుకు కూడా ఈ ఏడాది తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త.. ప్రాణం పోసుకొని పుట్టిన బిడ్డ ఇద్దరూ తన కళ్ళ ఎదుటే మరణించేసరికి మానసికంగా మరింత కృంగిపోయింది జానకి.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×