E-Paper
Advertisement

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!
Advertisement

Kia Opens Pre-Bookings for 3 New Models: భారత కార్ల మార్కెట్లో కియా తన పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కేరెన్స్ CNG, కేరెన్స్ క్లావిస్ CNG, కార్నివాల్ హైబ్రిడ్ మోడళ్లకు ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ మూడు మోడళ్లను ఇటీవల జరిగిన కియా ఇన్‌స్పిరేషన్ డే కార్యక్రమంలో ప్రదర్శించారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, మెరుగైన మైలేజ్‌తో పాటు ప్రీమియం డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కేరెన్స్, క్లావిస్‌కు CNG ఆప్షన్

కియా కేరెన్స్, కేరెన్స్ క్లావిస్ మోడళ్లకు తొలిసారిగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ రెండు వెర్షన్లు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ఆధారంగా రూపొందించబడ్డాయి. CNG మోడ్‌ లో ఇంజిన్ 95bhp పవర్, 123Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. CNG వ్యవస్థ కోసం 60 లీటర్ల సామర్థ్యం కలిగిన సిలిండర్‌ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా బయట నుంచి CNG కిట్ అమర్చుకునే అవసరం లేకుండా, కంపెనీ నుంచే ఫ్యాక్టరీ ఫిట్టింగ్‌ తో రావడం ఈ వెర్షన్లలో ప్రధాన ప్రత్యేకత.

CNG వెర్షన్లలో ప్రత్యేక మార్పులు!

Advertisement

CNG మోడళ్ల కోసం ఇంజిన్ క్యాలిబ్రేషన్‌ లో మార్పులు చేయడంతో పాటు సస్పెన్షన్‌ను కూడా సవరించారు. రెండు కార్లలో 16-అంగుళాల వీల్స్, 16-అంగుళాల డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్రైవర్‌కు అవసరమైన CNG సమాచారం అందించేందుకు 4.2-అంగుళాల కలర్ TFT MIDను కూడా ఇచ్చారు. ఇందులో CNG ఫ్యూయల్ చేంజ్ స్విచ్, మిగిలిన ప్రయాణ దూరాన్ని సూచించే DTE లాజిక్ లాంటి వివరాలు కనిపిస్తాయి. కేరెన్స్ CNGను ప్రీమియం (O) వేరియంట్‌ లో అందించనుండగా, కేరెన్స్ క్లావిస్ CNG HTE, HTE (O) వేరియంట్లలో లభిస్తుంది. కమర్షియల్, B2B వినియోగదారుల కోసం కూడా ప్రత్యేక వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.

కార్నివాల్‌కు హైబ్రిడ్ పవర్

మరోవైపు కియా తన ప్రీమియం MPV కార్నివాల్‌కు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేస్తోంది. కార్నివాల్ హైబ్రిడ్ లిమోసిన్+ ట్రిమ్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో 1.6-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపారు. పెట్రోల్ ఇంజిన్ 180hp పవర్, 265Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ అదనంగా 73.4hp పవర్, 30.4Nm టార్క్ అందిస్తుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్‌ను 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేశారు. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది.

కార్నివాల్‌ లో ప్రీమియం ఫీచర్లు

Advertisement

హైబ్రిడ్ కార్నివాల్‌లో 18-అంగుళాల క్రిస్టల్ కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎయిరోడైనమిక్స్‌ను మెరుగుపరిచేందుకు యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్‌ ను కూడా అందించారు. క్యాబిన్‌లో AQI డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, లెదరెట్ డోర్ ట్రిమ్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎత్తు సర్దుబాటు చేసుకునే, వెనక్కి మడిచే సీట్ బ్యాక్ టేబుల్స్ కూడా ఇచ్చారు.

Read Also: అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

Tags

Related News

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

Big Stories

Advertisement
×