E-Paper
Advertisement

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!
Advertisement

4 New Cars Launching in October 2026: అక్టోబర్ 2026లో లలో భారత కార్ల మార్కెట్‌ లో సందడి పెరగనుంది. కొత్త మోడళ్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని కార్లకు ఫే స్‌లిఫ్ట్ వెర్షన్లు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా SUVలు, ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ విభాగాల్లో పోటీ మరింత పెరగనుంది. వచ్చే నెలలో హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఆడి Q3, టయోటా గ్లాంజా ఫేస్‌ లిఫ్ట్, హ్యుందాయ్ బేయాన్ లాంటి నాలుగు మోడళ్లు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్

హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్ అక్టోబర్ 6న విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌ తో పోలిస్తే ఇందులో బయట డిజైన్‌ లో పలు మార్పులు కనిపించవచ్చు. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ LED లైట్లు, కొత్త బంపర్లు, కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది. క్యాబిన్‌ లోనూ కొన్ని కొత్త ఫీచర్లు చేరే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి సదుపాయాలు ఇందులో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఇంజిన్ విషయంలో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 121 hp పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చు.

నెక్స్ట్ జనరేషన్ ఆడి Q3

Advertisement

ప్రీమియం SUVలను ఇష్టపడేవారికి నెక్స్ట్ జనరేషన్ ఆడి Q3 ఆసక్తికరంగా మారనుంది. అక్టోబర్ 16న దేశంలో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ SUV పూర్తిగా కొత్త డిజైన్‌తో రానుంది. పెద్ద గ్రిల్, స్ప్లిట్ మ్యాట్రిక్స్ LED హెడ్‌ లైట్లు, వెనుక పూర్తి వెడల్పు LED లైట్ బార్ లాంటి మార్పులు ఇందులో ఉండనున్నాయి. లోపల కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 204 hp పవర్, 320 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో పాటు క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ కూడా  వస్తాయని భావిస్తున్నారు.

టయోటా గ్లాంజా ఫేస్‌ లిఫ్ట్

టయోటా గ్లాంజాకు కూడా అక్టోబర్‌ లో కొత్త రూపం రానుంది. మారుతి బాలెనోలో చేసిన మార్పులకు అనుగుణంగా గ్లాంజా ఫేస్‌ లిఫ్ట్‌ ను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. కొత్త ఫ్రంట్ డిజైన్, మారిన హెడ్‌లైట్లు, బంపర్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి మార్పులు రావచ్చని భావిస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, Level 2 ADAS వంటి ఫీచర్లు కూడా చేరే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చని అంచనా. CNG వెర్షన్ కూడా కొనసాగవచ్చు.

హ్యుందాయ్ బేయాన్

Advertisement

అక్టోబర్‌లో మరో కొత్త ఎంట్రీగా హ్యుందాయ్ బేయాన్ నిలవనుంది. నెల మధ్యలో ఈ అర్బన్ క్రాసోవర్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసే అవకాశం ఉంది. పెద్ద ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ LED లైటింగ్, ప్రత్యేకమైన టెయిల్ లైట్లతో ఆధునిక డిజైన్‌ను అందించవచ్చని తెలుస్తోంది. డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, యాంబియంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, Level 2 ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉండొచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ లేదంటే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని కంపెనీ ఎంచుకునే అవకాశం ఉంది.

Read Also: ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

Tags

Related News

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×