boAt PartyPal 390 Plus: ఇంట్లో చిన్న గెట్-టు-గెదర్ అయినా.. ఫ్రెండ్స్‌తో కలిసి చేసే.. పెద్ద పార్టీ అయినా మ్యూజిక్ లేకుండా ఆ మజానే రాదు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’ మార్కెట్లోకి ఒక అద్భుతమైన గాడ్జెట్‌ను తీసుకువచ్చింది. అదే boAt PartyPal 390 Plus. ముఖ్యంగా పాటలు పాడేందుకు.. ఇష్టపడేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా ‘కచే ఆటో-ట్యూనర్’ ఫీచర్ యాడ్ చేసింది. ఈ కొత్త పార్టీ స్పీకర్.. ప్రత్యేకతలు, పనితీరు, ధర గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ప్రస్తుత ట్రెండ్స్‌కు తగ్గట్టుగా.. బోట్ కంపెనీ ఈ మోడల్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ఇది చూడటానికి చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా.. పెద్ద రూమ్‌లు లేదా అవుట్ డోర్ పార్టీలకు పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. స్పీకర్ చుట్టూ ఉండే డైనమిక్ ఎల్ఈడీ లైట్స్ పార్టీ మూడ్‌ను ఇన్‌స్టంట్‌గా మార్చేస్తాయి. మ్యూజిక్ బీట్స్‌కు తగినట్టుగా ఈ లైట్స్ మారుతూ ఉండటం దీనికి మరింత హైలైట్‌గా నిలుస్తుంది.
సౌండ్ అవుట్‌పుట్ విషయానికి వస్తే.. బోట్ బ్రాండ్‌కు తగ్గట్టుగానే ఇది అత్యంత పవర్‌ఫుల్ బేస్, క్రిస్టల్ క్లియర్ ఆడియోను అందిస్తుంది. ఎంత పెద్ద హాల్‌లోనైనా .. సౌండ్ వచ్చేలాగా దీన్ని తయారు చేశారు. డీప్ బేస్ లవర్స్‌ను ఈ స్పీకర్ మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది.
ఈ స్పీకర్ అసలు సిసలు హైలైట్ ఏంటంటే.. దాని ‘కచే ఆటో-ట్యూనర్’ టెక్నాలజీ. చాలా మందికి పాటలు పాడాలని ఉన్నా.. గొంతు సరిగ్గా పలకదనో లేదా ట్యూన్ తప్పుతుందనో మొహమాట పడుతుంటారు. అలాంటి.. వారి కోసం ఈ ఆటో-ట్యూనర్ అద్భుతంగా పని చేస్తుంది. మనం పాడుతున్నప్పుడు వాయిస్‌లో ఉండే లోపాలను ఆటోమేటిక్‌గా సరిదిద్ది, ప్రొఫెషనల్ సింగర్ లాగా వినిపించేలా చేస్తుంది.
దీనితో పాటు వైర్‌లెస్ మైక్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఎలాంటి.. ఇబ్బంది లేకుండా మైక్ పట్టుకుని మీ స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేయెచ్చు. వాయిస్ ఎఫెక్ట్స్ మార్చుకోవడానికి ప్రత్యేకమైన కంట్రోల్స్ కూడా ఇచ్చారు.
ఈ లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈ మోడల్‌లో లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ సపోర్ట్ ఉంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్ టాప్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాకుండా USB డ్రైవ్‌లు, AUX కేబుల్స్ , మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఎఫ్ఎం రేడియో ఫీచర్ కూడా ఉండటం మరొక విశేషం.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. సుదీర్ఘ గంటలపాటు నిరంతరం పాటలు వినేలా.. లేదా పార్టీ చేసుకునేలా పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
Also Read: వీడియో వాచ్ ఫేసెస్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్..లుక్ అదుర్స్
ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ అంచనా ధర సుమారు రూ.8,999 నుంచి రూ. 10,999 వరకు ఉండొచ్చు. ఈ బడ్జెట్‌లో.. కచే ఆటో-ట్యూనర్, వైర్‌లెస్ మైక్ , పవర్ ఫుల్ బేస్ అందించే పార్టీ స్పీకర్ దొరకడం నిజంగా గొప్ప విషయమే. వీకెండ్ పార్టీలు, పుట్టిన రోజు వేడుకలు లేదా ఇంట్లోనే.. మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే యూత్‌కి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్!