iPhone 18 Pro vs iPhone Duo: యాపిల్ రీసెంట్‌గా తీసుకొచ్చిన సరికొత్త ‘ఐఫోన్ డ్యూయో’ (ఫోల్డబుల్ ఫోన్) గురించే ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. చూడటానికి ట్రెండ్‌గా, అదిరిపోయే లుక్‌లో ఉన్నప్పటికీ.. లక్షలు పెట్టి దీన్ని కొనాలా? లేదా రెగ్యులర్ ‘ఐఫోన్ 18 ప్రో’ను తీసుకోవాలా? అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది. ఎందుకంటే.. చూడటానికి కొత్తగా ఉన్నా.. డ్యూయోలో కొన్ని కీలకమైన ఫీచర్లు మిస్సయ్యాయి. అవేంటంటే.
ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్ ప్రైసే కదా. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ స్టార్టింగ్ ధరనే షాకిచ్చేలా ఏకంగా రూ.2 లక్షల దాకా ఉంది. అదే ఐఫోన్ 18 ప్రో అయితే రీజనబుల్ ప్రైస్‌కి వస్తుంది. ఒకవేళ డ్యూయో బడ్జెట్ పెట్టుకుంటే.. ఐఫోన్ ప్రోలో 1TB (టెరాబైట్) టాప్ మోడల్ కొనుక్కుని, మిగిలిన డబ్బులతో యాపిల్ వాచ్ లేదంటే ఎయిర్‌పాడ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫోన్‌కి ఏదైనా అయితే.. ఫోల్డబుల్ స్క్రీన్ రిపేర్ ఖర్చులు చాలా ఎక్కువ ఖరీదైనదిగా ఉంటుంది. అందుకే ప్రో మోడల్ బెస్ట్ అండ్ సేఫ్.
Also Read: రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!
ఫొటోలు, రీల్స్, వీడియోలు తీయడం ఇష్టమమైతే మాత్రం.. డ్యూయో అంతగా సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. దాని కెమెరాలు ప్రో కంటే మెరుగైనవి కావు. అదే ఐఫోన్ 18 ప్రో లో అదరగొట్టే లెన్సులు, పెద్ద సెన్సార్లు, వేరియబుల్ అపర్చర్ అండ్ 8x ఆప్టికల్ జూమ్ ఇచ్చారు. అంతేకాదు.. ఏఐతో ఎడిట్ చేసిన ఫొటోలను ఇట్టే పట్టేసే కొత్త రిఫరెన్స్ ఇమేజ్ ఫీచర్ కేవలం ఈ ప్రో మోడల్స్‌కే యాపిల్ ఇచ్చింది.
రోజంతా రీల్స్ స్క్రోలింగ్, యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాళ్లకు బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. యాపిల్ చెప్తున్న లెక్కల ప్రకారం ఐఫోన్ 18 ప్రో మాక్స్ బ్యాటరీ అదరగొడుతోంది. ఏకంగా 45 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. అదే డ్యూయో అయితే పెద్ద స్క్రీన్ ఓపెన్ చేసి వాడినప్పుడు బ్యాటరీ త్వరగా అయిపోతుంది. పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా ప్రో మోడల్స్‌లో స్పీడ్ చాలా ఎక్కువ.
యాపిల్ ఫోన్ అనగానే టక్కున గుర్తుకొచ్చే సెక్యూరిటీ ఫీచర్ ‘ఫేస్ ఐడీ’. కంటి చూపుతో, చిరునవ్వుతో ఫోన్ అన్‌లాక్ అయిపోయే ఆ మ్యాజిక్ ఎంతో ఈజీ. కానీ ఈ కొత్త ఫోల్డబుల్ డ్యూయోలో మాత్రం యాపిల్ పాత టచ్ ఐడీకి మళ్లీ వెనక్కి వెళ్లింది. లక్షలు పెట్టి కొనే ఫోన్‌లో ఫేస్ ఐడీ లేకపోవడం నిజంగా చాలా పెద్ద మైనస్ అనిపించక మానదు. సెక్యూరిటీ పరంగా ఫేస్ ఐడీ ఇచ్చే కంఫర్టే వేరు.
ఐఫోన్ 18 ప్రో వాడటం మనందరికీ వెన్నతో పెట్టిన విద్యే. ఎలాంటి కొత్త కన్ఫ్యూజన్లు లేకుండా చాలా స్మూత్‌గా, సింపుల్‌గా వాడొచ్చు. కానీ డ్యూయో ఫోల్డబుల్ స్క్రీన్, దాని యాప్స్ అడ్జస్ట్‌మెంట్లు, కొత్త ఇంటరాక్షన్స్ అన్నీ మనకు అలవాటు కావడానికి కొంచెం టైమ్ పడుతుంది. ప్రయోగాలు లేకుండా ప్రశాంతంగా రోజూ వాడే ఫోన్ లాగా ఎలాంటి రిస్క్ లేని బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే కళ్లు మూసుకుని ఐఫోన్ 18 ప్రో సెలెక్ట్ చేసుకోవచ్చు.
Also Read: మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!