BigTV English
Advertisement

Kubera Collections : ‘కుబేర’ బ్లాక్ బస్టర్ కాదు… కోట్లల్లో లాస్… పాపం బయ్యర్లు అప్పుల పాలు

Kubera Collections : ‘కుబేర’ బ్లాక్ బస్టర్ కాదు… కోట్లల్లో లాస్… పాపం బయ్యర్లు అప్పుల పాలు

Kubera Collections : అంతా తెలిపోయింది. అహో.. అదరహో… అంటూ చెప్పుకొచ్చిన ‘కుబేర’ బాక్సాపీస్ ముందు దూదిపింజలా తేలిపోతుంది. సినిమా చూసి మురిసిపోయి 3 స్టార్స్ ఇచ్చినవాళ్లు ఇప్పుడు ఆ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసి జడ్జిమెంట్ ఎక్కడా మిస్ అయింది అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.


బ్లాక్ బాస్టర్ విజయం సాధిస్తుంది అని అనుకున్న మూవీ ఇప్పుడు భారీ స్థాయిల్లో నష్టాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఎంతో నమ్మకంతో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు అప్పుల పాలు అవుతున్నారట. ఏ ఏరియాల్లో నష్టాలు వస్తున్నాయి ? ఎంత లాస్ అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కాంబోలో మూవీ వస్తుంది. అందులోనూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా అంటే డే 1 నుంచి చాలా ఎక్సపెక్టషన్స్ వచ్చాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమాకు కొన్ని ఏరియాల్లో నుంచి మిక్సిడ్ టాక్. మరి కొన్ని ఏరియాల్లో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అంత నోటెడ్ గా ఏం రాలేదు.


టార్గెట్ ఎంత ? వచ్చిందేంత ?

కానీ, చిన్న హోప్ మౌత్ టాక్ వల్ల శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. వాళ్లే హిట్ చేస్తారని ఉండేది. ఇప్పుడు శని ఆదివారాలు అయిపోయాయి. సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూస్తే బ్రేక్ ఈవెన్‌‌కు చాలా దూరంలోనే ఆగిపోయింది.

ఈ మూవీ లాభాల బాట పట్టాలంటే 66 కోట్ల షేర్ – 125 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కానీ, ఈ మూవీ ఆదివారం నాటికి 75 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ సినిమా నష్టాల నుంచి తప్పించుకోవాలంటే కనీసం 50 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కోట్లు రావడం అంటే చాలా కష్టం.

తమిళనాడులో 8 కోట్లు లాస్ ?

ఈ సినిమాలో మెయిన్ లీడ్ ధనుష్. ఈ హీరోకు కోలీవుడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. అయినా.. అక్కడ 8 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు ట్రెడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను 18 కోట్లలకు బయ్యర్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు తమిళనాడులో 10 కోట్ల షేర్ కూడా రాలేదట. దీంతో ఇప్పటి వరకు బయ్యర్లకు దాదాపు 8 కోట్ల వరకు నష్టం వచ్చిందని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి

తమిళనాడులోనే కాదు… తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను తీసుకున్న బయ్యర్లు నష్టాలను చూస్తున్నారట. ఒక ఈస్ట్ ఏరియాలోనే 80 లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈస్ట్‌తో పాటు సీడెడ్, గుంటూరు ఏరియాల్లో కూడా కుబేర సినిమాకు పూర్ కలెక్షన్లు వస్తున్నాయట. ఈ ఏరియాల్లో బయ్యర్లకు నష్టం తప్పేలా లేద అని అంటున్నారు.

3 గంటలకు పైగ నిడివే కారణం ?

3 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడం అంత ఈజీగా కాదు. అలా 3 గంటలకు పైగా నిడివితో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువే అని చెప్పాలి.

యానిమల్ మూవీ లాంటి కంటెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు. కానీ, కుబేర లా స్లో నారేషన్ ఉండి 3 గంటలకు పైగా నిడివితో ఉంటే ఆడియన్స్ థియేటర్ గడప తొక్కడం చాలా కష్టం. ఇప్పుడు అది మరోసారి ప్రూవ్ అయింది. కాగా కుబేర మూవీ 3 గంటల 13 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Related News

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Sandeep Kishan : సందీప్‌తో విజయ్ కొడుకు కొత్త మూవీ… టైటిల్ పోస్టర్ వచ్చేసింది..

The Rajasaab: సంక్రాంతి అన్నారు.. సడీ లేదు.. చప్పుడు లేదు.. అసలు సినిమా వస్తుందా ?

RT76: భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ.. ఎన్ని కోట్లంటే..?

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Imanvi : ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్.. ఆ హీరోయిన్స్ జాబితాలో ఇమాన్వి!

SSMB 29 Update: జక్కన్న నుంచి మరో సర్ప్రైజ్… హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

Big Stories

×