E-Paper
Advertisement

తలైవా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… అదే ఆఖరి సినిమానా..?

తలైవా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… అదే ఆఖరి సినిమానా..?
Advertisement

Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజె ను సొంతం చేసుకున్నాడు.. వయసు పెరుగుతున్న సరే సినిమాల లెక్క మాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. ఇటీవల ఆయన నటించిన కూలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు జైలర్ 2 మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా? లేదంటే ఈ వార్తలు కేవలం పుకార్లేనా అన్నది ఒక్కసారి మనం తెలుసుకుందాం..

సినిమాలకు రజినీ గుడ్ బై..

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. సీనియర్ హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.. కానీ ఏ హీరో కూడా గుడ్ బై చెప్పబోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 175వ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కానున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఈ చిత్రాన్ని ముగించి రిటైర్ అవుతారనే వార్త రావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సినిమాలకు దూరమైతే కోలీవుడ్ ఇండస్ట్రీ ఇద్దరు స్టార్ హీరోలను మిస్ అవుతుంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

రజినీ కాంత్ సినిమాల విషయానికొస్తే…

Advertisement

రజినీకాంత్ కూలి సినిమాతో తన అకౌంట్లో భారీ విషయాన్ని సొంతం చేసుకున్నాడు. గతంలో థియేటర్లలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జైలర్ కు సీక్వెల్ కి రాబోతున్న సినిమాలో ఈయన నటిస్తున్నారు.. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం 173 చిత్రం ధర్మన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ రెండు పూర్తయిన వెంటనే రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ వార్తలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభా బుద్ధిపోనిచ్చుకోలేదు.. హమ్మమ్మ మనోజ్ సేఫ్.. బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

‘జన నాయగన్ ‘ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్లు మార్చుకున్న స్టార్ హీరోలు..!

Lenin Twitter Review : ‘లెనిన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అయ్యగారు అకౌంట్లో హిట్ పడిందా..?

ఆ పలకరింపే ఊపిరిపోసింది.. రాశీఖన్నా ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

Big Stories

Advertisement
×