Mokshagna Debut:సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఒక మెగా సీరియల్ సాగిపోతుంది.అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు అంటూ ఇక ఊరించడమే గాని ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చింది లేదు .అప్పుడెప్పుడో ప్రశాంత్ వర్మ హనుమాన్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సింబా అంటూ సినిమాకి ముహూర్తం పెట్టేశారు మేకర్స్.కానీ ఆ సినిమా అతిగతి లేకుండా పోయింది.
సందీప్ రెడ్డి వంగ చేతిలో పెట్టబోతున్న బాలయ్య
ఇక అంతకుముందే సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్, ఆదిత్య 999 మాక్స్’తోనే ఎంట్రీ అంటూ హడావిడి చేశారు .ఇక అప్పటినుండి డేట్లు, సంవత్సరాలు . క్యాలెండర్లు అన్ని మారిపోతున్నాయి కానీ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ మాత్రం మారలేదు.ఇక తాజాగా లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ ప్రాజెక్టుని ‘అర్జున్ రెడ్డి’ (2017), ‘కబీర్ సింగ్’ (2019) యానిమల్ (2023)వంటి సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ చేతిలో పెట్టబోతున్నాడట బాలయ్య .
also read :అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాయణం.. కానీ పెళ్లయ్యాక నరకం !
చాలా సైలెంట్ గా ఇంట్రెస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్
ఇక్కడ ఇంకో విశేషమేంటంటే బాలయ్య బాబు స్వయంగా ఈ సినిమా కథకి అందిస్తున్నాడని టాక్.వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా చూస్తే సందీప్ ఆల్రెడీ ప్రభాస్ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు .ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ,ఆ తర్వాత యానిమల్ పార్క్ అంటూ దాదాపు 2030 వరకు డైరీ ఖాళీ లేకుండా ఉన్నాడు.అలాంటి బిజీ డైరెక్టర్ బాలయ్య స్క్రిప్ట్ కు డైరెక్షన్ చేస్తాడంటే ఆశ్చర్యమే .నిజానికి ‘చిరుత’ (2007)తోనో, జూనియర్ ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ (2001)తో చాలా సైలెంట్ గా ఇంట్రెస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.కానీ మోక్షజ్ఞ మాత్రం ఇంకా సెక్స్ పైకి వెళ్ళకముందే అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు అంటూ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప వచ్చింది లేదు .
అన్న, అంకుల్ వంటి క్యారెక్టర్లు వేయాల్సి వస్తుందేమో
ఇప్పటికే 30లలో అడిగిపెట్టిన మోక్షజ్ఞ ఇంకా ఇలాగే సాగ తీసుకుంటూ పోతే ఆ తర్వాత అన్న, అంకుల్ వంటి క్యారెక్టర్లు వేయాల్సి వస్తుందేమో .ఎప్పటికప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఇదిగో అదిగో అంటూ, రికార్డులు చెరిగిపోవడం ఖాయం, బాక్స్ ఆఫీస్ బద్దలు ఇవ్వడం ఖాయం అంటూ కాలర్ ఎగరేస్తుంటే అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేక యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ కే పరిమితం అవుతుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.ఏదేమైనా వంగ – బాలయ్య కాంబో అంటే ఇండస్ట్రీలో క్రేజ్ మామూలుగా ఉండదు .కానీ ఈ విషయం మ్యాటర్ ముహూర్తం దాటి ముందుకు వెళ్తుందో లేదో తెలియాలంటే వారి నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే .
ఏదేమైనా అప్పటివరకు ఈ మోక్షజ్ఞ ఎంట్రీ అనేది సోషల్ మీడియాకు మంచి టైం పాస్ అని చెప్పాలి.
also read :సోగ్గాడు రియల్ లైఫ్ సీక్రెట్స్:భార్య శాంతకుమారి మరణంతో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విశేషాలు!